Ola : ఓలా యాప్ తో పర్సనల్ లోన్స్

Ola : ఓలా యాప్ తో పర్సనల్ లోన్స్
X

దేశంలోని ప్రముఖ ఫిన్ టెక్ యూనికార్న్ అయిన ఇన్ క్రెడ్ ఫైనాన్సియల్ సర్వీసెస్, పర్సనల్ లోన్స్ ని అందించడానికి మరొక ప్రముఖ కంపెనీ అయిన ఓలా ఫైనాన్సియల్ సర్వీసెస్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఓలా యాప్ ద్వారా పర్సనల్ లోన్స్ ను అందించాలనే ఉద్దేశంతో ఈ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ మిలియన్ల మంది వినియోగదారులకు లోన్స్ ను సులభంగా అందించాలనే ఉద్దేశంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ భాగస్వామ్యం కారణంగా వినియోగదారులు ఓలా యాప్ ద్వారా రూ. 10 లక్షల వరకు పర్సనల్ లోన్స్ ను పొందే అవకాశం ఉంటుంది. అర్హులైన వినియోగదారులకు లోన్స్ ను సులభంగా అందించమే తమ లక్ష్యమని ఇన్ క్రెడ్ ఫైనాన్స్ కి చెందిన కన్స్యూమర్ ఫైనాన్స్ సీఈఓ పృధ్వి చంద్రశేఖర్ చెప్పారు. దీనిలో భాగంగానే ఓలాతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం జరిగిందని తెలిపారు. ఈ భాగస్వామ్యం మా లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రధాన మైలు రాయి అని, అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ఓలా యాప్ ద్వారా ఎలాంటి అవాంతరాలు లేకుండా లోన్స్ ని సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చునని పేర్కొన్నారు.

Tags

Next Story