India EFTA : భారత్-EFTA ఒప్పందంతో కొత్త శకం.. 15 ఏళ్లలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలు

India EFTA : భారత్-EFTA ఒప్పందంతో కొత్త శకం.. 15 ఏళ్లలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలు
X

India EFTA : భారత్, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (EFTA) దేశాల మధ్య కుదిరిన చారిత్రక వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం తాజాగా అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ద్వారా భారత దేశానికి అనేక ప్రయోజనాలు లభించనున్నాయి. ముఖ్యంగా రాబోయే 15 సంవత్సరాలలో ఐరోపా దేశాల నుంచి భారత్‌కు 100 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా దీని ద్వారా దేశంలో 10 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా వేస్తున్నారు. ఈ ఒప్పందంపై మార్చి 10, 2024న సంతకాలు చేసినప్పటికీ, అక్టోబర్ 1, 2025 నుంచి ఇది అధికారికంగా అమలులోకి వచ్చింది.

EFTA అంటే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. యూరప్‌లోని నాలుగు అత్యంత అభివృద్ధి చెందిన దేశాల అంతర-ప్రభుత్వ సంస్థ ఇది. ఇందులో ఐస్‌లాండ్, లిచెన్‌స్టైన్, నార్వే, స్విట్జర్లాండ్. ఈ నాలుగు అగ్ర దేశాలతో భారత్ మొట్టమొదటిసారిగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ EFTA-భారత్ FTA ఒప్పందం ద్వారా భారత్‌కు లభించే టారిఫ్ రాయితీలు భారీగా ఉన్నాయి. భారత్ నుంచి EFTA దేశాలకు ఎగుమతి అయ్యే దాదాపు 99.6 శాతం ఉత్పత్తులపై టారిఫ్ రాయితీ లభిస్తుంది. భారత్ ఉత్పత్తి చేసే 92.2 శాతం వస్తువులకు టారిఫ్ మినహాయింపు ఇవ్వబడుతుంది. ఇందులో ప్రాసెస్ చేసిన వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయేతర ఉత్పత్తులు కూడా ఉన్నాయి.

2024-25లో భారత్ ఈ నాలుగు దేశాలకు మొత్తం 72.37 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. వీటిలో ముఖ్యంగా గోరు చిక్కుడు, ప్రాసెస్ చేసిన కూరగాయలు, బాస్మతి బియ్యం, పప్పులు, పండ్లు, ద్రాక్ష వంటివి ఉన్నాయి. ఈ ఒప్పందం కింద, EFTA దేశాల నుంచి వచ్చే ఎగుమతులకు భారత్ కూడా టారిఫ్ రాయితీలు ఇచ్చింది. EFTA దేశాల నుంచి భారత్‌కు ఎగుమతి అయ్యే 82.7 శాతం వస్తువులకు రాయితీ ఇవ్వడం జరిగింది. ఇది EFTA దేశాల మొత్తం ఎగుమతుల్లో 95.3 శాతంకు ప్రయోజనం చేకూరుస్తుంది.

ఈ FTA ఒప్పందం నుంచి భారత ప్రభుత్వం కొన్ని సున్నిత రంగాలను దూరంగా ఉంచింది. అంటే, ఈ రంగాలకు సంబంధించిన EFTA ఎగుమతులపై భారత్ అధిక టారిఫ్‌లను కొనసాగించవచ్చు. డైరీ ఉత్పత్తులు, సోయా, బొగ్గు, ఫార్మా, మెడికల్ డివైజ్‌లు వంటివి.

Tags

Next Story