6G Technology : 5G కంటే 1000 రెట్లు వేగం.. 6G నెట్‌వర్క్‌పై భారత్ ఫోకస్, ఎప్పటికి అందుబాటులోకి?

6G Technology : 5G కంటే 1000 రెట్లు వేగం.. 6G నెట్‌వర్క్‌పై భారత్ ఫోకస్, ఎప్పటికి అందుబాటులోకి?
X

6G Technology : 3G, 4G రేసులో ఎప్పుడూ వెనుకబడిన భారత్ ఇప్పుడు 6G అభివృద్ధిలో ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలతో సమానంగా అడుగులు వేయడానికి సిద్ధమైంది. 2027 నాటికి వికసిత భారత్‎ను నిర్మించాలనే సంకల్పంతో ఉన్న ప్రభుత్వం, ఇప్పుడు 6G అభివృద్ధిని చాలా సీరియస్‌గా తీసుకుంది. ప్రపంచ నిపుణులతో భాగస్వామ్యం, దేశీయంగా ఆవిష్కరణలు, అత్యుత్తమ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మొదలైన వాటి ద్వారా 6వ తరం వైర్‌లెస్ టెక్నాలజీని అభివృద్ధి చేయాలనేది భారత్ కల. భవిష్యత్ టెలికాం సాంకేతికతలకు భారతదేశమే ప్రపంచ కేంద్రంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది.

6G అంటే ఆరవ తరం వైర్‌లెస్ టెక్నాలజీ. ఇప్పుడు 5G నెట్‌వర్క్ అన్ని చోట్లా అమలవుతోంది. మొదట 2G వచ్చింది.. ఆ తర్వాత 3G, 4G వచ్చాయి. ఇప్పుడు 5G అడుగు పెట్టింది. 6Gని ప్రపంచంలోని అనేక దేశాలు అభివృద్ధి చేస్తున్నాయి. కొన్ని చోట్ల 7G టెక్నాలజీ గురించి కూడా ఆలోచనలు జరుగుతున్నాయి.

5Gతో పోలిస్తే 6G నెట్‌వర్క్ చాలా వేగంగా ఉంటుంది. దీనిలో 1,000 రెట్లు ఎక్కువ వేగంతో ఇంటర్నెట్ లభిస్తుంది. 6Gతో పాటు AI ఆవిష్కరణలు కూడా కలిస్తే, శక్తివంతమైన టెలిఫోన్, ఇంటర్నెట్ టెక్నాలజీలు వెలుగులోకి వస్తాయి. రోబోటిక్స్, రియల్ టైమ్ గేమింగ్, రిమోట్ మెడికల్ సర్జరీ మొదలైన చాలా ఉపయోగకరమైన పనులు సులభమవుతాయి.

రెండు సంవత్సరాల క్రితమే భారతదేశం 6G విజన్‌ను విడుదల చేసింది. దాని ప్రకారం 2030 నాటికి భారతదేశంలో 6Gని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. 6G టెక్నాలజీ అభివృద్ధికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లను ప్రోత్సహించడానికి 106 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారు.

భారత్ 6G అలయెన్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో స్పెక్ట్రమ్, టెక్నాలజీ, యాప్ మొదలైన ఏడు వర్కింగ్ గ్రూపులు ఉన్నాయి. అమెరికా, యూరప్, ఫిన్లాండ్, సౌత్ కొరియా, జపాన్ మొదలైన దేశాలలో 6G అభివృద్ధికి సంస్థలు నిమగ్నమై ఉన్నాయి. వాటితో పాటు భారత్ 6G అలయన్స్ కూడా కలిసి పనిచేస్తుంది. దీని ద్వారా ప్రపంచంలోని ప్రముఖ శక్తులతో సమానంగా భారత్ కూడా 6G దిశగా అడుగులు వేస్తుంది.

Tags

Next Story