Indian Economy : భారత్ నుంచి కోట్లు కొల్లగొడుతున్న విదేశీ షిప్పింగ్ కంపెనీలు.. అసలు కారణం ఇదే

India Pays Billions to Foreign Shipping Companies PM Modi
Narendra Modi, Shipping, Indian Economy, Defense Budget, Shipping Industry, Self-reliance,
Indian Economy : భారత్ తన వాణిజ్య కార్యకలాపాల కోసం ఎక్కువగా విదేశీ షిప్పింగ్ కంపెనీలపై ఆధారపడుతోందని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. ఈ కారణంగా మన దేశం ఏటా భారీగా డబ్బును కోల్పోతోందని తెలిపారు. ఈ మొత్తం మన రక్షణ బడ్జెట్‌తో దాదాపు సమానంగా ఉందని ఆయన అన్నారు. భావనగర్లో జరిగిన సముద్ర సే సమృద్ధి కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తన వాణిజ్య కార్యకలాపాల కోసం ఎక్కువగా విదేశీ షిప్పింగ్ కంపెనీలపై ఆధారపడుతోందని, ఈ కారణంగా ఏటా దాదాపు 75 బిలియన్ డాలర్లు (సుమారు రూ.6 లక్షల కోట్లు) విదేశాలకు చెల్లిస్తోందని ఆయన అన్నారు. ఈ మొత్తం మన దేశ రక్షణ బడ్జెట్‌తో సమానంగా ఉందని మోడీ తెలిపారు.
"దశాబ్దాలుగా విదేశీ నౌకలపై ఆధారపడటం వల్ల మనం చాలా వనరులను కోల్పోయాం. ఈ కారణంగా విదేశాలలో లక్షలాది ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. మనం స్వంత షిప్పింగ్ రంగాన్ని నిర్మించుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం." అని మోడీ అన్నారు. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం అంటే 50 ఏళ్ల కిందట, భారతదేశం నౌకలు మన దేశంలో జరిగే 40% వాణిజ్యాన్ని నిర్వహించేవి. కానీ, తప్పుడు విధానాల వల్ల ఇప్పుడు ఆ వాటా కేవలం 5%కి పడిపోయింది. మిగిలిన 95% వస్తువుల రవాణా కోసం విదేశీ నౌకలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగానే భారత్ భారీగా నష్టపోతోందని ప్రధాని చెప్పారు.
సముద్ర రంగంలో భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడానికి కొత్త సంస్కరణలను మోడీ ప్రకటించారు. నౌకల తయారీని ప్రోత్సహించడంతో పాటు, పోర్టుల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు ఈ సంస్కరణలు తోడ్పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ దిశగా ప్రభుత్వం వన్ నేషన్ వన్ డాక్యుమెంట్, వన్ నేషన్ వన్ పోర్ట్ విధానాలను అమలు చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ సంస్కరణలు వాణిజ్య కార్యకలాపాలను సులభతరం చేయడంతో పాటు, సముద్ర రంగంలో భారతదేశం వాణిజ్య శక్తిని తిరిగి సాధించడంలో సహాయపడతాయని మోడీ చెప్పారు. 2047 నాటికి భారత్ సముద్ర శక్తిలో ఉన్నత స్థానానికి చేరుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com