DEAL: రష్యాతో భారత్ రక్షణ ఒప్పందం

DEAL: రష్యాతో భారత్ రక్షణ ఒప్పందం
X
ఎస్‌-400 భారీ కొనుగోలు....రూ. 3.6 లక్షల కోట్ల డీల్\ సరిహద్దుల్లో రక్షణ కవచం

భారత రక్షణ రంగ ము­ఖ­చి­త్రా­న్ని పూ­ర్తి­గా మా­ర్చే­సే­లా కేం­ద్ర ప్ర­భు­త్వం అత్యంత కీలక ని­ర్ణ­యా­ల­ను వె­లు­వ­రిం­చిం­ది. రక్షణ మం­త్రి రాజ్ నాథ్ సిం­గ్ అధ్య­క్ష­తన సమా­వే­శ­మైన డి­ఫె­న్స్ అక్వి­జి­ష­న్ కౌ­న్సి­ల్ (డీ­ఏ­సీ), రష్యా నుం­డి ఏకం­గా 288 ఎస్‌-400 క్షి­ప­ణుల కొ­ను­గో­లు­కు ‘యా­క్సె­ప్టె­న్స్ ఆఫ్ నె­సె­సి­టీ’ (ఏఓ­ఎ­న్‌) కింద ఆమో­దం తె­లి­పిం­ది. సు­మా­రు 10 వేల కో­ట్ల రూ­పా­యల వ్య­యం­తో చే­ప­ట్ట­ను­న్న ఈ భారీ రక్షణ ఒప్పం­దం­లో 120 స్వ­ల్ప శ్రే­ణి, 168 సు­దీ­ర్ఘ శ్రే­ణి క్షి­ప­ణు­లు ఉన్నా­యి. గత ఏడా­ది జరి­గిన ‘ఆప­రే­ష­న్ సిం­దూ­ర్’ సమ­యం­లో వి­ని­యో­గిం­చిన క్షి­ప­ణి ని­ల్వ­ల­ను పు­న­రు­ద్ధ­రిం­చ­డం­తో పాటు, వై­మా­నిక దళా­న్ని ప్ర­పం­చం­లో­నే అత్యంత శక్తి­వం­త­మైన దళం­గా తీ­ర్చి­ది­ద్ద­డ­మే ఈ ఒప్పంద ప్ర­ధాన లక్ష్యం. ఈ మొ­త్తం ప్ర­క్రి­య­ను అత్యంత వే­గం­గా పూ­ర్తి చే­సేం­దు­కు ‘ఫా­స్ట్ ట్రా­క్ ప్రొ­సీ­జ­ర్’ (ఎఫ్‌­టీ­పీ) మా­ర్గా­న్ని ఎం­చు­కో­వ­డం దేశ భద్రత పట్ల ప్ర­భు­త్వా­ని­కి ఉన్న చి­త్త­శు­ద్ధి­ని చా­టు­తోం­ది.

గత ఏడా­ది పా­కి­స్తా­న్‌­తో తలె­త్తిన తీ­వ్ర ఉద్రి­క్త­తల సమ­యం­లో ఎస్‌-400 క్షి­ప­ణి వ్య­వ­స్థ తన అద్భు­త­మైన వి­శ్వ­రూ­పా­న్ని ప్ర­పం­చా­ని­కి చా­టి­చె­ప్పిం­ది. పం­జా­బ్ సరి­హ­ద్దు నుం­చి ఏకం­గా 314 కి­లో­మీ­ట­ర్ల దూ­రం­లో ఉన్న శత్రు యు­ద్ధ వి­మా­నా­న్ని కూ­ల్చి­వే­సి ఈ వ్య­వ­స్థ సరి­కొ­త్త రి­కా­ర్డు సృ­ష్టిం­చిం­ది. ఆదం­పూ­ర్, భుజ్ సె­క్టా­ర్ల­లో భారత సై­న్యం మో­హ­రిం­చిన ఈ వ్య­వ­స్థ ధా­టి­కి భయ­ప­డిన పాక్, తన యు­ద్ధ వి­మా­నా­ల­ను సు­ర­క్షిత ప్రాం­తా­ల­కు తర­లిం­చా­ల్సిన పరి­స్థి­తి ఏర్ప­డిం­ది. ఇప్పు­డు కొ­త్త­గా కొ­ను­గో­లు చే­య­బో­యే 400 కి.మీ, 200 కి.మీ, 150 కి.మీ, 40 కి.మీ శ్రే­ణి క్షి­ప­ణు­లు భవి­ష్య­త్తు­లో పొం­చి ఉన్న డ్రో­న్ దా­డు­ల­ను, ఆధు­నిక శత్రు వి­మా­నా­ల­ను సమ­ర్థ­వం­తం­గా తి­ప్పి­కొ­ట్ట­డా­ని­కి భా­ర­త్‌­కు తి­రు­గు­లే­ని బలా­న్ని అం­దిం­చ­ను­న్నా­యి. ఇప్ప­టి­కే ఉన్న ఎస్‌-400 వ్య­వ­స్థ­ల­కు రష్యా­కు చెం­దిన ‘పాం­త్సి­ర్’ స్వ­ల్ప శ్రే­ణి వ్య­వ­స్థ­ల­ను కూడా అను­సం­ధా­నం చే­య­డం ద్వా­రా సరి­హ­ద్దు­ల్లో ఒక అజే­య­మైన ‘టూ-లే­య­ర్’ రక్షణ కవచం ఏర్ప­డ­నుం­ది.

త్రి­విధ దళాల సమ­గ్ర ఆధు­నీ­క­రణ కోసం రక్షణ మం­త్రి­త్వ శాఖ మొ­త్తం 3.60 లక్షల కో­ట్ల రూ­పా­యల వి­లు­వైన భారీ ని­ధు­ల­కు పచ్చ­జెం­డా ఊపిం­ది. ఇం­దు­లో భా­గం­గా వై­మా­నిక దళం కోసం మల్టీ-రోల్ ఫై­ట­ర్ ఎయి­ర్‌­క్రా­ఫ్ట్ (ఎం­ఆ­ర్‌­ఎ­ఫ్‌ఏ), అత్యా­ధు­నిక రా­ఫె­ల్ యు­ద్ధ వి­మా­నా­లు, నిఘా కోసం హై-ఆల్టి­ట్యూ­డ్ శా­టి­లై­ట్ల­ను కొ­ను­గో­లు చే­య­ను­న్నా­రు. ‘మేక్ ఇన్ ఇం­డి­యా’ ని­నా­దా­ని­కి ప్రా­ధా­న్య­త­ని­స్తూ, మె­జా­రి­టీ యు­ద్ధ వి­మా­నా­ల­ను భా­ర­త్‌­లో­నే తయా­రు చే­యా­ల­ని ని­ర్ణ­యిం­చ­డం దే­శీయ రక్షణ పరి­శ్ర­మ­కు గొ­ప్ప ఊత­మి­వ్వ­నుం­ది. నౌ­కా­ద­ళం కోసం అత్యా­ధు­నిక పి-8ఐ వి­మా­నా­ల­ను సమ­కూ­ర్చు­కో­వ­డం ద్వా­రా హిం­దూ మహా­స­ము­ద్రం­లో భారత ఆధి­ప­త్యం మరింత పె­ర­గ­నుం­ది. శత్రు­వుల సబ్‌­మె­రై­న్ల­ను వె­తి­కి పట్టు­కో­వ­డం­లో, సము­ద్ర మా­ర్గం­లో నిఘా ఉం­చ­డం­లో ఈ వి­మా­నా­లు అత్యంత కీ­ల­కం­గా మా­ర­ను­న్నా­యి. భూతల సై­న్యం (ఆర్మీ) బలో­పే­తం కోసం కూడా భారీ కే­టా­యిం­పు­లు జరి­గా­యి. ము­ఖ్యం­గా శత్రు­వుల ట్యాం­కు­ల­ను ధ్వం­సం చే­సేం­దు­కు వి­భ­వ్ యాం­టీ-ట్యాం­క్ మై­న్ల కొ­ను­గో­లు­తో పాటు, ప్ర­స్తు­తం ఉన్న టీ-72 ట్యాం­కు­ల­ను ఆధు­నీ­క­రిం­చేం­దు­కు ప్ర­త్యేక ని­ధు­లు కే­టా­యిం­చా­రు. మా­రు­తు­న్న కా­లా­ని­కి అను­గు­ణం­గా సై­బ­ర్ దా­డు­లు, అం­త­రి­క్ష యు­ద్ధ తం­త్రా­ల­ను ఎదు­ర్కో­వ­డా­ని­కి వీ­లు­గా అత్యా­ధు­నిక సాం­కే­తి­క­త­ను రక్షణ రం­గం­లో ప్ర­వే­శ­పె­ట్ట­డం ఒక నూతన అధ్యా­యం­గా ని­ల­వ­నుం­ది. ఎస్‌-400 క్షి­ప­ణుల నుం­డి రా­ఫె­ల్ యు­ద్ధ వి­మా­నాల వరకు అన్ని వి­భా­గా­ల్లో భా­ర­త్ తన స్వ­యం ప్ర­తి­ప­త్తి­ని ని­రూ­పిం­చు­కుం­టూ శత్రు దే­శా­ల­కు గట్టి హె­చ్చ­రి­క­ను పం­పిం­ది. కే­టా­యిం­పు­లు పూ­ర్త­యి­తే గగ­న­త­లం­పై­కి రా­వ­డా­ని­కి ఏ శత్రు­వై­నా ఆలో­చిం­చా­ల్సిం­దే.

Tags

Next Story