Cheapest Electric Car : దేశంలోకెల్లా చౌకైన ఈవీ కారు.. బైక్ ధరలో దీనిని కొనొచ్చు.

Cheapest Electric Car : భారతీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అనేక ఆటోమొబైల్ కంపెనీలు కొత్త ఈవీలను విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లలోకెల్లా అత్యంత చౌకైన కారు Eva. ఈ చిన్న కారులో ఇద్దరు పెద్దలు ఒక చిన్న పిల్లాడు సులభంగా ప్రయాణించవచ్చు.
ఈ కారు నోవా (Nova), స్టెల్లా (Stella), వేగా (Vega) అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారును ఒక కిలోమీటరు ప్రయాణించడానికి కేవలం రూ.2 మాత్రమే ఖర్చు అవుతుందని కంపెనీ చెబుతోంది. ఈ Eva ఎలక్ట్రిక్ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.3.25 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. భారతీయ మార్కెట్‌లో ఈ ధర కంటే తక్కువకు మరే ఇతర ఎలక్ట్రిక్ కారు ప్రస్తుతం లేదు.
బేస్ వేరియంట్ అయిన నోవా ధర రూ.3.25 లక్షలు. మిడ్ వేరియంట్ స్టెల్లా ధర రూ.3.99 లక్షలు. టాప్ వేరియంట్ వేగా ధర రూ.4.49 లక్షలు. Eva కారులో వేరియంట్‌ను బట్టి మూడు రకాల బ్యాటరీ ప్యాక్‌లు, రేంజ్‌లు ఉన్నాయి. నోవాలో 9 kWh బ్యాటరీ ప్యాక్‌తో సింగిల్ ఛార్జ్‌పై 125 కి.మీ దూరం ప్రయాణించొచ్చు.స్టెల్లాలో ఉన్న 12.6 kWh బ్యాటరీ ప్యాక్‌తో సింగిల్ ఛార్జ్‌పై 175 కి.మీ దూరం ప్రయాణించవచ్చు.
ఇక వేగా వేరియంట్ లో 18 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 250 కి.మీ దూరం ప్రయాణించగలదు. ఈ కారులో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ సేఫ్టీ కోసం ఇచ్చారు. ఇందులో CCS2 ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. అంతేకాకుండా ఈ కారులో ల్యాప్‌టాప్‌ను ఛార్జ్ చేసుకునే ప్రత్యేక ఫీచర్ కూడా ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

