iPhone 16 : ఐఫోన్ 16 కోసం జనం బారులు.. ఫుల్ డిమాండ్

iPhone 16 : ఐఫోన్ 16 కోసం జనం బారులు.. ఫుల్ డిమాండ్
X

ఆపిల్‌ న్యూ సిరీస్ ఐఫోన్‌ 16 సిరీస్ కోసం జనాలు క్యూ కట్టారు. ఆపిల్ యొక్క కుపెర్టినో ప్రధాన కార్యాలయం వద్ద భారీ లైన్ లో ఫోన్ కొనేందుకు జనం నిలబడి ఉన్నారు. ఐఫోన్‌ 16 సిరీస్‌ని సొంతం చేసుకున్న మొదటి వ్యక్తుల్లో ఒకరం కావాలనే ఉత్సాహంతో స్టోర్‌ ముందు బారులు తీరారు. ఈ క్రేజీ ఫోన్‌ను దక్కించుకునేందుకు ఇప్పటికే ముందస్తు బుకింగ్స్ సైతం భారీగా చేసుకున్నారు.

ఐఫోన్‌ 16 సిరీస్‌ కెమెరాలో చాలా మార్పులు జరిగాయి. హై రిజల్యూషన్‌తో కూడిన అల్ట్రా వైడ్‌ కెమెరా, క్యాప్చర్‌ బటన్‌ సహా పలు మార్పులు చేశారు. ఐఫోన్‌ 16 సిరీస్‌లో నాలుగు మోడల్‌లు ఉన్నాయి. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16ప్రో, ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ ఉన్నాయి. ఏడాదిలో అన్ని నాలుగు ఐఫోన్ మోడల్‌లు యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు సపోర్టుతో వస్తాయని సూచిస్తోంది.

న్యూ ఐఫోన్‌ 16 సిరీస్‌ ఇమేజ్‌ల కోసం న్యూ ఫార్మాట్‌ను వినియోగిస్తోంది. జెపెగ్‌-ఎక్స్‌ఎల్‌ అని ఈ న్యూ ఫార్మాట్‌ను పిలుస్తారు. ఇక ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16 ప్లస్‌ బ్యాక్‌ ప్యానెల్‌లో డ్యూయల్‌ కెమెరా సెటప్‌ కలిగి ఉంటాయని తెలుస్తోంది. 1x, 2x జూమ్ సామర్ధ్యాలతో ప్రైమరీ వైడ్‌యాంగిల్‌ లెన్స్‌తో కెమెరా సెటప్‌ ఉంటుంది. దీంతోపాటు విస్తృతమైన సీన్స్‌ను క్యాప్చర్ చేసేందుకు 0.5x జూమ్‌తో సెకండరీ అల్ట్రా వైడ్‌ లెన్స్‌ ఉండనున్నాయి.

ఐఫోన్ 16 మోడల్ బేస్ మోడల్‌ ఫొన్‌ స్టోరేజ్‌ 128జీబీ కాగా దాని ధర రూ.67వేలు. ఇక ఐఫోన్ 16 ప్లస్ ధర రూ.75 వేల 5 వందలు. ఐఫోన్ 16ప్రో 256 జీబీ స్టోరేజ్ తో అందుబాటులో వుంటుంది. దాని ధర 92 వేల 3వందల రూపాయలు. కాగా.. టాప్-ఆఫ్-ది-లైన్ ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ ఇంటర్నల్ స్టోరేజీతో ధర లక్ష 7 వందల రూపాయలు. యాపిల్ ఐఫోన్ 16 పెద్ద బ్యాటరీతో వస్తున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story