iPhone 16 : ఐఫోన్ 16లో కొత్త ఫీచర్లేంటో తెలుసా.. నేటి నుంచే ప్రీ బుకింగ్

యాపిల్ యూజర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఫోన్16 వచ్చేసింది. ఈ నెల 9న కాలిఫోర్నియాలో జరిగిన యాపిల్ యాన్యువల్ ఈవెంట్ లో ఐఫోన్16ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. యాపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో మరింత శక్తిమంతంగా ఇవి రూపొందాయి. లేటెస్ట్ కెమెరా కంట్రోల్ ఫీచరుతో పాటు కొత్త బటన్లు ఉన్నాయి. ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్ ఏ18తో వచ్చింది. ఐఫోన్ 16 మోడళ్లతోపాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, వాచ్ అల్ట్రా, ఎయిర్‌పాడ్స్ 4, ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్, ఎయిర్‌పాడ్స్ ప్రొ 2లను లాంచ్ చేశారు. అయితే, ఐఫోన్16, వాచ్ లు, ఎయిర్ పాడ్స్ లో సరికొత్త ఫీచర్లు ఏమున్నాయో తెలుసుకుందాం.
నాలుగు మోడల్స్..
ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రొ, ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్.. అనే నాలుగు మోడళ్లను యాపిల్ తీసుకొచ్చింది. గూగుల్ పిక్సెల్ 9, శాంసంగ్ గెలాక్సీ ఎస్24లో అందుబాటులోకి వచ్చిన ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తరహాలో యాపిల్ ఇంటెలిజెన్స్‌తో వీటిని తీసుకొచ్చింది. చాలా వరకు ఏఐ టాస్క్‌లు రిమోట్ డేటా సెంటర్లకు బదులుగా ఐఫోన్‌లోనే పూర్తవుతాయి. కొత్త ఫోన్లు ఐవోఎస్18తో పనిచేస్తాయి.
కెమెరా కంట్రోల్ ఇలా..
కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్ అనే రెండు కొత్త బటన్లను తీసుకొచ్చారు. కెమెరా కంట్రోల్ బటన్ ద్వారా ‘విజువల్ ఇంటెలిజెన్స్’తో మాక్రో ఫొటోలు, స్పేషియల్ ఫొటోలు,వీడియోలు తీసుకోవచ్చు. 48 మెగాపిక్సెల్ తో మెయిన్ కెమెరా ఉంటుంది. డాల్బీ విజన్‌లో 4కే60 వీడియోను తీసుకోవచ్చు. వీడియోల్లో గాలి సౌండ్ ను కూడా తగ్గించొచ్చు.
నేటి నుంచే ప్రీ బుకింగ్.. 20 నుంచి సేల్స్
యాపిల్ ఐఫోన్16 ప్రీబుకింగ్స్ నేటి నుంచి మొదలుకానుంది. నేడు యాపిల్ స్టోర్, యాపిల్ ఇండియా వెబ్‌సైట్ లేదా ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లాంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ లో ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. అఫిషియల్ సేల్స్ ఈ నెల 20 నుంచి ప్రారంభమవుతాయి. ఆ తర్వాత నుంచి ఐఫోన్ 16 సిరీస్ ఆన్ లైన్, ఫిజికల్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com