iPhone 16 Launch : సెప్టెంబర్ 9న మార్కెట్ లోకి ఐఫోన్ 16

ఆపిల్ ఐఫోన్16 సిరీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రీమియం స్మార్ట్ ఫోన్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపై కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఇట్స్ గ్లో టైమ్ పేరుతో జరిగే ఈవెంట్ లో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లతో పాటు ఇతర ప్రొడక్టులను రివీల్ చేయనున్నట్లు వెల్లడించింది. ఆపిల్ పార్క్ లోని స్టీవ్ జాబ్స్ థియేటర్ లో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరగనున్నట్లు కంపెనీ వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 9న రాత్రి 10:30 గంటలకు ఈ ఈవెంట్ ప్రారంభం అవుతుంది. ఎప్పటిలానే ఐఫోన్ 16 సిరీస్ లో నాలుగు కొత్త మోడల్స్ లాంఛ్ కానున్నాయి. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ పేర్లతో ఇవి మార్కెట్లో విడుదల కానున్నాయి. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు ఐఓఎస్18 తో రానున్నాయి. ఈ ఆపరేటింగ్ సిస్టంతో వస్తున్న మొదటి ఆఫిల్ ఫోన్లు ఇవే. అప్డేట్ల కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా ప్రీ ఇన్ స్టాల్ గా ఈ ఓఎస్ తో రానున్నాయి. ఇక ప్రో మోడల్స్ లో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ఉండబోతుందని తెలుస్తోంది. అక్టోబర్ లో ఈ ఫీచర్ ను యూజర్లకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేలా ఆపిల్ ప్లాన్ చేసినట్లు సమచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com