SIP : కోటి రూపాయల కల.. నెలకు రూ. 10,000 SIP తో 10 ఏళ్లలో సాధ్యమేనా?

SIP : కోటి రూపాయల కల.. నెలకు రూ. 10,000 SIP తో 10 ఏళ్లలో సాధ్యమేనా?
X

SIP : ప్రతి ఒక్కరి కల కోటీశ్వరులు కావడం. అయితే, కేవలం జీతంలో నుంచి కొంత డబ్బు పొదుపు చేస్తూ వెళితే, కోటి రూపాయలు కూడబెట్టడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు. ఉదాహరణకు, మీ ప్రస్తుత జీతం రూ. 40,000 ఉండి, 25 ఏళ్ల తర్వాత మీ రిటైర్‌మెంట్ సమయానికి జీతం రూ. 1.50 లక్షలు అవుతుందని అనుకుంటే, ప్రతి నెలా అందులో 30 శాతం పొదుపు చేస్తూ పోతే, రిటైర్‌మెంట్ నాటికి మీ దగ్గర కేవలం రూ. 71 లక్షలు మాత్రమే ఉండే అవకాశం ఉంది. మరి, అదే డబ్బును సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే ఎంత రిటర్న్ వస్తుందో వివరంగా తెలుసుకుందాం.

ఒకవేళ మీరు పైన చెప్పిన విధంగా 25 ఏళ్ల పాటు స్థిరంగా పొదుపు చేసిన డబ్బును సిప్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే, దాని నుంచి వచ్చే రిటర్న్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంలో చాలా మ్యూచువల్ ఫండ్స్ కనీసం 8 శాతం వృద్ధిని అందిస్తాయి. ఈ లెక్కన 25 ఏళ్లలో మీ మొత్తం పెట్టుబడి రూ. 1.82 కోట్లు అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మ్యూచువల్ ఫండ్‌లో వృద్ధి రేటు 10 శాతం ఉంటే, 25 ఏళ్ల తర్వాత మీరు పొందే మొత్తం రూ. 2.33 కోట్లు అవుతుంది. అందుకే, కేవలం పొదుపు చేయడం కంటే, క్రమంగా పెట్టుబడి పెట్టడం అత్యంత ముఖ్యం.

నెలకు రూ. 10,000 సిప్ తో కేవలం 10 సంవత్సరాలలో రూ.కోటి సంపాదించడం అసాధ్యం. మీ పెట్టుబడి సంవత్సరానికి 30 శాతం వృద్ధి చెందినా కూడా, 10 ఏళ్లలో కోటి రూపాయల లక్ష్యాన్ని చేరుకోలేదు. 10 సంవత్సరాలలో రూ.కోటి లక్ష్యాన్ని చేరుకోవాలంటే, మీరు నెలకు రూ. 40,000 నుంచి రూ. 60,000 వరకు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది.

కోటి రూపాయల కోసం ఎంత పెట్టుబడి పెట్టాలి?

10 సంవత్సరాలలో రూ.కోటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత నెలవారీ సిప్ అవసరమో చూద్దాం. వార్షిక వృద్ధి రేటు 12 శాతం అయితే, ప్రతి నెలా మీరు రూ. 44,700 సిప్ చేయాల్సి ఉంటుంది. వార్షిక వృద్ధి రేటు 10 శాతం అయితే, 10 ఏళ్లలో రూ.కోటి పొందడానికి ప్రతి నెలా రూ. 49,700 సిప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి, నెలకు రూ. 10,000 పెట్టుబడితో కోటి రూపాయలు పొందాలంటే, సమయాన్ని పెంచడం లేదా నెలవారీ పెట్టుబడిని పెంచడం ఒక్కటే మార్గం.

Tags

Next Story