FASTAG : మీ బండికి 'ఫాస్టాగ్ ' లేదా..? ఇకనుంచి రెట్టింపు టోల్

FASTAG : మీ బండికి ఫాస్టాగ్  లేదా..? ఇకనుంచి రెట్టింపు టోల్
X

టోల్ గేట్ వద్ద రద్దీ నియంత్రణకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్ హెచ్ఎఐ) పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వాహనాల ముందు అద్దం విండ్ షీల్డ్ పై ఫాస్టాగ్ ను అమర్చని వాహనదారుల నుంచి రెట్టింపు టోల్ వసూలు చేయాలని నిర్ణయించింది.

ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. ఫాస్టాగ్ ఉద్దేశపూర్వకంగా విండ్ షీల్డ్ పై అతికించకపోవడం వల్ల టోల్ ప్లాజాల వద్ద అనవసర జాప్యం ఏర్పడుతోందని, దీని వల్ల ఇతర వాహనదారులకు అసౌకర్యం కలుగుతుందని పేర్కొంది. దీన్ని నివారించేందుకు వాహనదారులు తప్పనిసరిగా ముందు అద్దంపై ఫాస్టాగ్ అతికించుకోవాలని కోరింది.

Tags

Next Story