Car Launches : కార్ల జాతర మొదలైంది..జనవరి ఎండ్ లోపు 6 కొత్త కార్లు లాంచ్.

Car Launches : కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే మీ బడ్జెట్ సిద్ధం చేసుకోండి. 2026 ప్రారంభం భారత ఆటోమొబైల్ రంగానికి ఒక పండగలా మారింది. ఇప్పటికే కొన్ని దిగ్గజ కార్లు మార్కెట్లోకి వచ్చేశాయి, కానీ అసలైన ఆట ఇంకా ముందుంది. జనవరి నెలాఖరు లోపు మరో 6 అదిరిపోయే కార్లు రోడ్లపైకి రాబోతున్నాయి. ఎలక్ట్రిక్ నుంచి ఎస్‌యూవీల వరకు.. అన్ని రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మరి ఆ సిక్స్ ప్యాక్ కార్లు ఏవో, వాటి ప్రత్యేకతలు ఏంటో వివరంగా చూద్దాం.
1. సరికొత్త రెనో డస్టర్ : భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ ట్రెండ్‌ను తెచ్చిన రెనో డస్టర్ మళ్ళీ కొత్త అవతారంలో రాబోతోంది. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఈ కారును లాంచ్ చేయనున్నారు. ఇంటర్నేషనల్ మోడల్ తరహాలోనే ఇది కూడా చాలా అగ్రెసివ్‌గా ఉంటుంది. లోపల 10.1 అంగుళాల స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్, అద్భుతమైన యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉండబోతున్నాయి. ఆఫ్‌రోడింగ్ ప్రియులకు డస్టర్ మళ్ళీ ఒక స్వీట్ మెమరీగా మారనుంది.
2. నిస్సాన్ గ్రావైట్ : జనవరి 21న నిస్సాన్ తన కొత్త ఎంపీవీ గ్రావైట్ ను విడుదల చేయనుంది. ఇది రూ.10 లక్షల కంటే తక్కువ బడ్జెట్‌లో వచ్చే ఫ్యామిలీ కారు. రెనో ట్రైబర్ ప్లాట్‌ఫారమ్‌పైనే తయారైనప్పటికీ, దీని డిజైన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. 8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్, 6 ఎయిర్‌బ్యాగ్‌లతో ఫ్యామిలీ సేఫ్టీకి ప్రాధాన్యత ఇచ్చారు. బడ్జెట్ లో 7-సీటర్ కారు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
3. మారుతి సుజుకి ఈ-విటారా : మారుతి సుజుకి నుంచి వస్తున్న మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇది. జనవరి నెలాఖరులో ఇది లాంచ్ కానుంది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 543 కిలోమీటర్ల వరకు వెళ్తుందని కంపెనీ చెబుతోంది. ఇది నేరుగా టాటా కర్వ్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఈవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. మారుతి నమ్మకం, ఎలక్ట్రిక్ పవర్ కలిసి ఈ కారును రారాజుగా మార్చబోతున్నాయి.
4. టయోటా అర్బన్ క్రూజర్ ఈవీ : మారుతి ఈ-విటారాకు కవల సోదరి లాంటి కారు ఇది. టయోటా నుంచి వస్తున్న మొదటి మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. మారుతి కారుతో పోలిస్తే దీని స్టైలింగ్, ఫ్రంట్ గ్రిల్ వేరేలా ఉంటాయి. రేంజ్, ఫీచర్లు దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ, టయోటా బ్రాండ్ వాల్యూ దీనికి అదనపు బలం.
5. ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ ఆర్-లైన్ : లగ్జరీ, పవర్ ఇష్టపడే వారి కోసం ఫోక్స్‌వ్యాగన్ టైరాన్ ను తీసుకొస్తోంది. ఇది టిగువాన్ కు 7-సీటర్ వెర్షన్ లాంటిది. ఇందులో 15-అంగుళాల భారీ స్క్రీన్, మసాజ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఉంటాయి. 204 పీఎస్ పవర్ ఇచ్చే ఇంజిన్ తో ఇది రోడ్లపై పరుగులు తీయనుంది.
6. స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ : స్కోడా కుషాక్ కు ఇది మొదటి పెద్ద అప్డేట్. కొత్త డ్యాష్‌బోర్డ్, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరాతో ఈ కారు మళ్ళీ రీ-లాంచ్ కాబోతోంది. సేఫ్టీ విషయంలో ఇప్పటికే 5-స్టార్ రేటింగ్ ఉన్న ఈ కారు, ఇప్పుడు మరిన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో కస్టమర్లను పలకరించనుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

