Jawa 350 Price Cut: రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు గట్టిపోటీ.. భారీగా తగ్గిన జావా 350 ధర.. మరి ఏ బైక్ కొనాలి ?

Jawa 350 Price Cut: జీఎస్టీ తగ్గింపు కారణంగా రెట్రో స్టైల్ బైక్‌లలో ఒకటైన జావా 350 ధరలో ఏకంగా రూ.15,543 భారీ తగ్గింపు వచ్చింది. దీంతో ఈ బైక్ ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కి మరింత గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ధర తగ్గకముందు జావా 350 ప్రారంభ ధర రూ.1,98,950 ఉండగా, ఇప్పుడు ఇది రూ.1,83,407 (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతోంది. అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ప్రారంభ ధర రూ.1,81,129. అంటే, రెండు బైకుల ప్రారంభ ధరలు దాదాపు ఒకే విధంగా ఉండటంతో రెట్రో డిజైన్‌ను ఇష్టపడే వారికి జావా 350 ఇప్పుడు మరింత మెరుగైన ఎంపికగా మారింది.
రెండు బైక్‌ల ఇంజన్లను పోల్చి చూస్తే, జావా 350 లో 334cc లిక్విడ్-కూల్డ్ ఇంజన్ ఉంది. ఇది 22.57 PS పవర్, 28.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్-అసిస్ట్ క్లచ్ ఉండటం వల్ల హైవేపై గంటకు 125 కిమీ వేగాన్ని సులభంగా అందుకోగలదు. లిక్విడ్-కూలింగ్ ఉండటం వల్ల లాంగ్ రైడ్స్‌లో ఇంజన్ వేడెక్కకుండా స్థిరంగా పనిచేస్తుంది. దీనికి పోటీగా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 లో 349cc ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది, ఇది 20.2 bhp పవర్, 27 Nm టార్క్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. క్లాసిక్ 350 ఇంజన్ జావా కంటే తక్కువ రిఫైన్డ్‌గా ఉన్నప్పటికీ, రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రత్యేకమైన థంప్ సౌండ్ దీన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది.
మైలేజ్ విషయానికి వస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొంచెం మెరుగ్గా కనిపిస్తుంది. క్లాసిక్ 350 ARAI ప్రకారం లీటరుకు 41.55 కిమీ మైలేజ్ ఇస్తుండగా, సాధారణంగా లీటరకు 32 నుంచి 35 కిమీ మైలేజ్ ఇస్తుంది. దీనికి భిన్నంగా, జావా 350 ARAI మైలేజ్ లీటరుకు 30 కిమీ, రియల్-వరల్డ్‌లో లీటరుకు 28.5 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఫీచర్ల పరంగా జావా 350 మోడ్రన్ టెక్నాలజీలో ముందంజలో ఉంది. ఇందులో డిజిటల్-అనలాగ్ కన్సోల్, USB ఛార్జింగ్, LED హెడ్‌లైట్, డ్యూయల్-ఛానల్ ABS, మెరుగైన సస్పెన్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మొత్తం మీద స్మూత్ రైడింగ్ అనుభూతి, మెరుగైన రిఫైన్‌మెంట్, మోడర్న్ ఫీచర్లను కోరుకునే వారికి జావా 350 మంచి ఎంపిక. అదే క్లాసిక్ లుక్, థంప్ సౌండ్, కాస్త మెరుగైన మైలేజ్ కావాలనుకుంటే క్లాసిక్ 350 బెస్ట్ ఛాయిస్.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

