Jeep : టాటా హారియర్, XUV700కు పోటీగా కొత్త జీప్ కంపాస్ ట్రాక్ ఎడిషన్..అదిరే ఫీచర్లు, ధర ఎంతంటే ?

Jeep : టాటా హారియర్, XUV700కు పోటీగా కొత్త జీప్ కంపాస్ ట్రాక్ ఎడిషన్..అదిరే ఫీచర్లు, ధర ఎంతంటే ?
X

Jeep : భారతదేశ ఎస్యూవీ మార్కెట్లో మరోసారి తన ప్రత్యేకత చాటుకోవడానికి జీప్ ఇండియా సిద్ధమైంది. కంపెనీ తమ అత్యంత ప్రజాదరణ పొందిన కంపాస్ మోడల్‌కు చెందిన లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్ అయిన కొత్త కంపాస్ ట్రాక్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీని ప్రీమియం డిజైన్, లగ్జరీ ఫీచర్స్, పవర్ఫుల్ పర్ఫామెన్స్ కాంబినేషన్లో రూపొందించారు. మార్కెట్లో ఇది టాటా హారియర్, మహీంద్రా ఎక్స్‌యూవీ700, హ్యుందాయ్ టక్సన్ వంటి ప్రముఖ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

కొత్త కంపాస్ ట్రాక్ ఎడిషన్ పాత కంపాస్ కంటే కూడా మరింత బోల్డ్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తుంది. రోడ్డుపై ఈ కారుకు స్పెషల్ గుర్తింపునిచ్చేలా కంపెనీ దీనికి తన సిగ్నేచర్ హుడ్ డెకాల్స్, పియానో బ్లాక్ గ్రిల్, ప్రత్యేకంగా ట్రాక్ ఎడిషన్ బ్యాడ్జింగ్‌ను ఇచ్చింది. దీని స్పోర్టీ లుక్‌ను పెంచడానికి 18-అంగుళాల డైమండ్-కట్ టెక్ గ్రే అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు.

ఈ కారు ఇంటీరియర్ లగ్జరీ ఎక్సపీరియన్స్ అందిస్తుంది. టుపెలో లెదరెట్ సీట్లు, స్మోక్ క్రోమ్ ఫినిషింగ్, స్ప్రూస్ బీజ్ కలర్ స్టిచింగ్‌లు దీనికి ప్రత్యేక ప్రీమియం లుక్‌ ఇస్తాయి. లెదర్ కోటెడ్ స్టీరింగ్ వీల్ , పియానో బ్లాక్ ఫినిషింగ్ లోపలి డిజైన్‌ను మరింత మెరుగుపరుస్తాయి. టెక్నాలజీ పరంగా ఇందులో 10.1-అంగుళాల యుకనెక్ట్ 5 టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది, ఇది వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా 10.25-అంగుళాల డిజిటల్ టీఎఫ్‌టీ క్లస్టర్, అల్పైన్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి.

కొత్త కంపాస్ ట్రాక్ ఎడిషన్ మంచి పర్ఫామెన్స్ కు ప్రసిద్ధి చెందింది. ఇందులో 2.0-లీటర్ మల్టీజెట్ II టర్బో డీజిల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ 170 హార్స్‌పవర్ ఎనర్జీ, 350 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కస్టమర్‌లు 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా సెగ్మెంట్‌లో ప్రత్యేకమైన 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఎంచుకోవచ్చు. ఇది 2డబ్ల్యుడి, 4డబ్ల్యుడి ఆప్షన్లలో లభిస్తుంది. దీనివల్ల సిటీ డ్రైవింగ్‌తో పాటు ఆఫ్-రోడింగ్ కు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.

జీప్ కంపాస్ ట్రాక్ ఎడిషన్ సేఫ్టీ విషయంలో రాజీ పడలేదు. ఇందులో 50కి పైగా అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. వీటిలో ఏబీఎస్ తో ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‌సీ), హిల్ స్టార్ట్ అసిస్ట్, ఆల్-స్పీడ్ ట్రాక్షన్ కంట్రోల్, అడ్వాన్స్‌డ్ బ్రేక్ అసిస్ట్ వంటివి ముఖ్యమైనవి. ఈ సేఫ్టీ ఫీచర్లు కారు లగ్జరీ, స్టైల్‌తో పాటు ప్రయాణీకులకు పూర్తి భద్రతను అందిస్తాయి.

జీప్ కంపాస్ ట్రాక్ ఎడిషన్ భారతదేశంలోని అన్ని జీప్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది. బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ రూ. 26.78 లక్షలు, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రూ. 28.64 లక్షలు, ఆటోమేటిక్, 4x4 (AT 4x4) రూ. 30.58 లక్షలు. కంపెనీ అదనంగా రూ. 8,200 విలువైన ఏఎక్స్ఎస్ ప్యాక్‌ను కూడా ప్రత్యేక ఆఫర్‌గా అందిస్తోంది.

Tags

Next Story