Jeep : జీప్ కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఏకంగా 4 లక్షల రూపాయల డిస్కౌంట్.

Jeep : జీప్ కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఏకంగా 4 లక్షల రూపాయల డిస్కౌంట్.
X

Jeep : అమెరికన్ కార్ల దిగ్గజం జీప్ ప్రస్తుతం ఇండియాలో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. అమ్మకాలు భారీగా పడిపోవడంతో, కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ ఫిబ్రవరి నెలలో ఏకంగా రూ.4 లక్షల వరకు బంపర్ డిస్కౌంట్లు ప్రకటించింది. గత నెల అంటే జనవరి 2026లో దేశవ్యాప్తంగా కేవలం 228 కార్లు మాత్రమే అమ్ముడవడంతో, కంపెనీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.

జీప్ కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు

జీప్ బ్రాండ్ అంటే రోడ్డుపై ఒక విలక్షణమైన గుర్తింపు. కానీ మారుతున్న పోటీలో జీప్ వెనకబడిపోయింది. జనవరిలో కేవలం 228 యూనిట్లు మాత్రమే అమ్ముడవడం కంపెనీని ఆలోచనలో పడేసింది. దీంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు జీప్ కంపాస్, జీప్ మెరిడియన్, గ్రాండ్ చెరోకీ మోడళ్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. డీలర్, నగరాన్ని బట్టి ఈ ఆఫర్లలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.

జీప్ కంపాస్: రూ. 2.75 లక్షల ఆదా

జీప్ బ్రాండ్‌లో అందరికీ అందుబాటులో ఉండే మోడల్ కంపాస్. దీనిపై ఇప్పుడు రూ.2.75 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో కార్పొరేట్ ఆఫర్లు, కన్జ్యూమర్ డిస్కౌంట్లు కలిసి ఉన్నాయి. 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు, అద్భుతమైన ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రస్తుతం దీని ప్రారంభ ధర రూ. 17.73 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

జీప్ మెరిడియన్: ఏకంగా రూ. 3.25 లక్షల తగ్గింపు

ఫ్యామిలీతో కలిసి వెళ్లాలనుకునే వారికి 5 మరియు 7 సీటర్ ఆప్షన్లలో లభించే మెరిడియన్ సరైన ఎంపిక. దీనిపై ఫిబ్రవరి నెలలో రూ.3.25 లక్షల వరకు భారీ తగ్గింపు ఇస్తున్నారు. 170 హార్స్‌పవర్ ఇచ్చే శక్తివంతమైన ఇంజిన్, 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 4X4 సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్న ఈ కారు ధర రూ.23.33 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

గ్రాండ్ చెరోకీ: రూ. 4 లక్షల ధమాకా

జీప్ నుంచి లభించే అత్యంత ఖరీదైన, లగ్జరీ SUV గ్రాండ్ చెరోకీ పై అత్యధికంగా రూ.4 లక్షల డిస్కౌంట్ లభిస్తోంది. కేవలం ధర తగ్గించడమే కాకుండా, జీప్ వేవ్ ప్రోగ్రామ్ కింద 3 ఏళ్ల వారంటీ, ప్రయారిటీ సర్వీసింగ్ వంటి సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. 272 హార్స్‌పవర్ ఇచ్చే టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు ధర రూ.63 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది.

Tags

Next Story