Jio AirFiber : జియో ఫ్రీడం ఆఫర్

Jio AirFiber : జియో ఫ్రీడం ఆఫర్
X

రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ ఫ్రీడం ఆఫర్ ను ప్రకటించింది. కొత్త కనెక్షన్స్ పై యూజర్లు 30 శాతం డిస్కౌంట్ పొందవచ్చని జియో తెలిపింది. ఈ ఆఫర్లో ఇన్ స్టాలేషన్ ఛార్జీలు 1000 చెల్లించాల్సిన అవసరంలేదని తెలిపింది. ఇది జులై 26 నుంచి ఆగస్టు 15 వరకు ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది.

ఈ 20 రోజుల్లో జియో ఎయిర్ ఫైబర్ ను బుక్ చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. మూడు నెలల ఆల్ ఇన్ వన్ ప్లాన్ ధర 2121 రూపాయలు. ఇన్స్టాలేషన్ ఛార్జీలు 1000 రూపాయలు కలిపి 3121 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఫ్రీడం ఆఫర్లో యూ జర్లు 2121 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.

ఈ ఆఫర్ మూడు, ఆరు నెలలు, సంవత్సర ప్లాన్లకు మాత్రమే వర్తిస్తుందని జియో తెలిపింది. జూన్లో దేశవ్యాప్తంగా 11 లక్షల కొత్త ఎయిర్ ఫైబర్ కనెక్షన్ల వచ్చాయి.

Tags

Next Story