Jio : రూ.11కే 10జీబీ డేటా..బూస్టర్ ప్లాన్‌ను తీసుకొచ్చిన జియో

X
By - Manikanta |14 Nov 2024 6:45 PM IST
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో కొత్త డేటా బూస్టర్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. కేవలం రూ.11 రీఛార్జితో 10జీబీ హై స్పీడ్ డేటాను వినియోగించుకొనే సదుపాయం తీసుకొచ్చింది. అయితే ఇందులో ఒక మెలిక ఉంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం గంట మాత్రమే. వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్ డేటా ప్లాన్‌ను వినియోగిస్తున్నవాళ్లు హైస్పీడ్ డేటా కోసం ఈ డేటా బూస్టర్‌తో రీఛార్జి చేసుకోవచ్చు. లార్జ్ ఫైల్స్ లేదా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు డౌన్‌లోడ్ చేయాలనుకొనేవారికి ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త డేటా బూస్టర్ ప్లాన్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లు ఈ ప్లాన్‌ను పరిశీలించొచ్చు. అయితే గంటలోపు 10జీబీ డేటా పూర్తయిపోయినా 64కేబీపీఎస్ వేగంతో అన్‌లిమిటెడ్ డేటాను వినియోగించుకోవచ్చని జియో తెలిపింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com