Jio : జియో సంచలనం.. కేవలం రూ.123 కే నెలంతా ఫ్రీ కాలింగ్, డేటా.

Jio : జియో సంచలనం.. కేవలం రూ.123 కే నెలంతా ఫ్రీ కాలింగ్, డేటా.
X

Jio : టెలికాం రంగంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ రిలయన్స్ జియో. సామాన్యులకు కూడా ఇంటర్నెట్, కాలింగ్ సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా జియో ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్లను ప్రకటిస్తోంది. తాజాగా కేవలం రూ.123కే నెలంతా వ్యాలిడిటీని ఇచ్చే ప్లాన్‌తో జియో మార్కెట్‌ను షేక్ చేస్తోంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లకు రీఛార్జ్ ధరలు భారంగా మారుతున్న ఈ సమయంలో, బడ్జెట్ వినియోగదారుల కోసం జియో తీసుకువచ్చిన ఈ ధమాకా ప్లాన్ విశేషాలు చూద్దాం.

రిలయన్స్ జియో అందిస్తున్న ఈ రూ.123 ప్లాన్ ముఖ్యంగా బడ్జెట్ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ఈ ప్లాన్ ద్వారా మీకు 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.ప్రతిరోజూ 0.5 GB హై స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే నెల మొత్తం మీద మీకు 14 GB డేటా అందుతుంది. ఒకవేళ డైలీ లిమిట్ అయిపోతే, ఇంటర్నెట్ స్పీడ్ 64kbps కి తగ్గుతుంది. భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. నెల మొత్తం మీద 300 ఎస్ఎంఎస్ లు ఉచితంగా లభిస్తాయి.

ఈ ప్లాన్ వినడానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నా, ఇందులో ఒక చిన్న కండిషన్ ఉంది. ఈ రూ.123 ప్లాన్ కేవలం జియో భారత్ ఫీచర్ ఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే మీరు సాధారణ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నట్లయితే, మీకు ఈ ఆఫర్ వర్తించదు. జియో భరత్ ఫోన్ ద్వారా సామాన్యులను డిజిటల్ విప్లవంలో భాగం చేయడానికి కంపెనీ ఈ చౌకైన ప్లాన్‌ను కేటాయించింది.

తక్కువ ధర ఉన్నప్పటికీ, జియో తన కస్టమర్లకు ఎంటర్టైన్మెంట్‌లో ఎక్కడా తగ్గలేదు. ఈ ప్లాన్‌తో పాటు జియో టీవీ, జియో సావన్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది. దీనికోసం మీరు అదనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మార్కెట్‌లోని ఇతర టెలికాం దిగ్గజాలు ఎయిర్‌టెల్ లేదా వొడాఫోన్ ఐడియా వద్ద 28 రోజుల వ్యాలిడిటీతో ఇంత తక్కువ ధరలో ఏ ప్లాన్ కూడా అందుబాటులో లేదు.

Tags

Next Story