Kawasaki : కవాసకి బంపర్ ఆఫర్.. 6 నెలలకే తగ్గిన వెర్సిస్-X 300 ధర.. రూ.46,000 విలువైన యాక్సెసరీస్ ఫ్రీ.

Kawasaki : కవాసకి బంపర్ ఆఫర్.. 6 నెలలకే తగ్గిన వెర్సిస్-X 300 ధర.. రూ.46,000 విలువైన యాక్సెసరీస్ ఫ్రీ.
X

Kawasaki : అడ్వెంచర్ బైక్ ప్రియులకు కవాసాకి ఇండియా అదిరిపోయే తీపి కబురు అందించింది. మార్కెట్లోకి విడుదలైన కేవలం ఆరు నెలల్లోనే తన పాపులర్ అడ్వెంచర్ బైక్ కవాసాకి వెర్సిస్-X 300 ధరను భారీగా తగ్గించింది. కేవలం ధర తగ్గించడమే కాకుండా, వేల రూపాయల విలువైన యాక్సెసరీలను కూడా ఉచితంగా అందిస్తూ కస్టమర్లను ఆశ్చర్యపరిచింది. కవాసాకి ఇండియా తన అడ్వెంచర్ బైక్ వెర్సిస్-X 300పై కస్టమర్ల కోసం అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద బైక్ ఎక్స్-షోరూమ్ ధరపై నేరుగా రూ.30,000 తగ్గింపు లభిస్తుంది. దీనితో ఈ బైక్ ధర రూ.3.49 లక్షల నుంచి రూ.3.19 లక్షలకు దిగివచ్చింది. ఇది చాలదన్నట్టుగా, బైక్‌తో పాటు సుమారు రూ.46,000 విలువైన యాక్సెసరీలను కూడా కంపెనీ పూర్తిగా ఉచితంగా ఇస్తోంది. ఈ పరిమిత కాల ఆఫర్ ఏప్రిల్ 30, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ధర తగ్గింపుతో కవాసాకి వెర్సిస్-X 300 ఇప్పుడు మార్కెట్లో మరింత హాట్ కేకులా మారింది. ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450, కేటీఎమ్ 390 అడ్వెంచర్ ఎక్స్ వంటి పాపులర్ బైక్‌లకు ఇది గట్టి పోటీనిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ వ్యాల్యూ కోరుకునే రైడర్లకు ఇది ఇప్పుడు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. ఈ ఆఫర్ కింద కస్టమర్లకు సెంటర్ స్టాండ్, హార్డ్ పానియర్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి. హార్డ్ పానియర్స్ సామర్థ్యం 34 లీటర్లుగా ఉంటుంది, ఇది లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు లగేజీని భద్రపరుచుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా ఈ యాక్సెసరీల కోసం వేల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది, కానీ ఇప్పుడు ఆ భారం కస్టమర్లపై పడదు.

పర్ఫార్మెన్స్ పరంగా ఈ బైక్ రైడర్లను అస్సలు నిరాశపరచదు. ఇందులో 296cc ప్యారలల్-ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 38.8bhp పవర్, 26Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ ఫీచర్ ఉండటం వల్ల గేర్లు మార్చడం చాలా సులభంగా మారుతుంది. దీని సస్పెన్షన్ సెటప్ లాంగ్ జర్నీలలో కూడా రైడర్‌కు మంచి సౌకర్యాన్ని ఇస్తుంది. కవాసాకి వెర్సిస్-X 300 ఫీచర్ల కంటే పెర్ఫార్మెన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, రైడింగ్ మోడ్స్ వంటి ఆధునిక ఫీచర్లు లేనప్పటికీ.. దీని కంఫర్టబుల్ సీటింగ్ పొజిషన్, స్ట్రెయిట్ రైడింగ్ స్టైల్ సుదూర ప్రయాణాలకు ఎంతో అనువుగా ఉంటాయి. ఈ బైక్ కొనాలనుకునే వారు ఆలస్యం చేయకుండా దగ్గరలోని డీలర్‌షిప్‌ను సంప్రదించడం మంచిది.

Tags

Next Story