Kawasaki Z900RS 2026 : ఏయ్ పాత లుక్.. కొత్త ఫీచర్లు.. కవాసకీ Z900RS కొత్త వెర్షన్ లాంచ్.

Kawasaki Z900RS 2026 : రెట్రో-స్టైల్ మోటార్‌సైకిల్స్ సెగ్మెంట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కవాసకీ కంపెనీ తమ 2026 Z900RS బైక్‌ను సరికొత్త ఫీచర్లు, అడ్వాన్సుడ్ టెక్నాలజీతో అప్‌డేట్ చేసి విడుదల చేసింది. ఆశ్చర్యకరంగా ఇంత అప్‌గ్రేడ్ చేసినా, కంపెనీ ఈ బైక్ ధరను మార్చలేదు. ఈ మోడల్ తన క్లాసిక్ Z1 లుక్‌ను నిలబెట్టుకుంటూనే రైడ్-బై-వైర్, క్రూయిజ్ కంట్రోల్ వంటి మోడ్రన్ ఫీచర్లను జోడించింది. మరింత ప్రీమియం, అడ్వాన్స్‌డ్ రైడింగ్ అనుభవాన్ని అందించడానికి ఈ బైక్‌లో ఎలాంటి మార్పులు చేశారో చూద్దాం.
కవాసకీ Z900RS 2026 మోడల్‌లో రైడర్‌కు మెరుగైన కంట్రోల్, పర్ఫామెన్స్ అందించే విధంగా ముఖ్యమైన అప్‌డేట్‌లను చేసింది. ఈ బైక్‌లోని అతిపెద్ద అప్‌డేట్ రైడ్-బై-వైర్ సిస్టమ్. ఈ సిస్టమ్ ఇంజిన్‌కు మెరుగైన, స్మూత్ కంట్రోల్‌ను అందిస్తుంది. ఈ రైడ్-బై-వైర్ ఫీచర్ కారణంగా ఇప్పుడు Z900RSలో క్రూయిజ్ కంట్రోల్ సదుపాయం కూడా లభిస్తుంది. దీనివల్ల ముఖ్యంగా హైవేలపై లాంగ్ జర్నీలు కూడా సౌకర్యవంతంగా మారతాయి.
గేర్లు మార్చడాన్ని మరింత సులభతరం చేయడానికి ఈ కొత్త వెర్షన్‌లో బిడైరెక్షనల్ క్విక్ షిఫ్ట్ టెక్నాలజీని కూడా జోడించారు. రైడర్ భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కవాసకీ ఈ బైక్‌లో మొట్టమొదటిసారిగా అడ్వాన్సుడ్ సేఫ్టీ టెక్నాలజీని అందించింది. ఈ బైక్‌లో IMU-బేస్డ్ రైడర్ అసిస్ట్ సిస్టమ్ను చేర్చారు. ఈ సిస్టమ్ రియల్ టైమ్‌లో బైక్ వంపు, వేగాన్ని నిశితంగా పర్యవేక్షిస్తుంది. దీని ద్వారా బైక్ మలుపులు తీసుకునేటప్పుడు బ్రేకింగ్ పవర్ డెలివరీని ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. దీనివల్ల రైడర్‌కు మెరుగైన కంట్రోల్ లభించి, ముఖ్యంగా స్పీడ్‌గా వెళ్లే రైడర్‌లకు భద్రత పెరుగుతుంది.
Z900RS ఇన్-లైన్-ఫోర్ ఇంజిన్ ఇప్పుడు మరింత రిఫైన్డ్ చేసింది. తక్కువ రెవ్‌లలో ఇంజిన్ చాలా స్మూత్ గా పనిచేస్తుంది. అదే సమయంలో హై స్పీడ్‌లలో కూడా దాని శక్తివంతమైన పనితీరును కొనసాగిస్తుంది. దీనికి కొత్తగా మెగాఫోన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ను జోడించారు. ఇది బైక్‌కు మరింత క్లాసిక్, పవర్ఫుల్ లుక్‌తో పాటు, మంచి సౌండ్‌ను ఇస్తుంది. రైడింగ్ కంఫర్ట్ కోసం బైక్‌లో అడ్జస్టబుల్ 41మి.మీ అప్-సైడ్ డౌన్ ఫోర్క్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ అందించారు. ముందు భాగంలో 300మి.మీ డ్యూయల్ డిస్క్ బ్రేకులు, రేడియల్-మౌంటెడ్ కాలిపర్స్ ఉన్నాయి. ఇవి అత్యుత్తమ బ్రేకింగ్ పవర్ అందిస్తాయి. సీటు ఎత్తు 835మి.మీ వద్ద ఉంది, కానీ చిన్న రైడర్‌ల కోసం 810మి.మీ సీటు ఆప్షన్‌ను కూడా కవాసకీ అందుబాటులో ఉంచింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

