Kia India : హైబ్రిడ్ మార్కెట్లో కియా హల్చల్.. భారత్ కోసం 3 కొత్త మోడళ్లు ఖరారు.. 2030 కల్లా లాంచ్.

Kia India : హైబ్రిడ్ మార్కెట్లో కియా హల్చల్.. భారత్ కోసం 3 కొత్త మోడళ్లు ఖరారు.. 2030 కల్లా లాంచ్.
X

Kia India : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు హైబ్రిడ్ కార్లకు కూడా ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా భారత మార్కెట్ కోసం తన మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. 2030 నాటికి దేశీయ రోడ్లపైకి మూడు సరికొత్త హైబ్రిడ్ మోడళ్లను తీసుకురానున్నట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. ఇందులో కియా సెల్టోస్, సోరెంటో, కార్నివాల్ వంటి పాపులర్ మోడళ్ల హైబ్రిడ్ వెర్షన్లు ఉండబోతున్నాయి.

కియా సెల్టోస్ హైబ్రిడ్

కియా అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ సెల్టోస్, త్వరలో హైబ్రిడ్ వెర్షన్‌లో రాబోతోంది. SP3i అనే కోడ్‌నేమ్‌తో తయారవుతున్న ఈ సెల్టోస్ హైబ్రిడ్, 2027 ప్రథమార్ధంలో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇంజిన్ వివరాలను కంపెనీ వెల్లడించనప్పటికీ, మీడియా నివేదికల ప్రకారం.. తన నమ్మకమైన 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఎలక్ట్రిక్ మోటార్‌తో అనుసంధానించవచ్చు. దీనివల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గడమే కాకుండా, మైలేజీ భారీగా పెరిగే అవకాశం ఉంది.

సోరెంటో, కార్నివాల్ - లగ్జరీ హైబ్రిడ్స్

సెల్టోస్ తర్వాత 2027 ద్వితీయార్ధంలో కియా సోరెంటో హైబ్రిడ్ ఎస్‌యూవీ భారత వీధుల్లోకి రానుంది. ఈ త్రీ-రో ఎస్‌యూవీ 4.8 మీటర్ల పొడవుతో చాలా గంభీరంగా ఉండబోతోంది. ఇక ఆ తర్వాత ప్రీమియం ఎంపీవీ కార్నివాల్ హైబ్రిడ్ ఎంట్రీ ఇస్తుంది. అంతర్జాతీయంగా ఈ కార్లలో 1.6 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, పవర్ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఇవి దాదాపు 227bhp నుంచి 242bhp వరకు పవర్‌ను ఉత్పత్తి చేయగలవు. ఈ మోడళ్లు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రాబోతున్నాయి.

కియా సైరోస్ ఈవీ

హైబ్రిడ్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ పైన కూడా కియా కన్నేసింది. 2026 మధ్య నాటికి కియా సైరోస్ ఈవీని లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. ఇది కారె కంటే కొంచెం తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. బడ్జెట్ ఈవీ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ కారు, హ్యుందాయ్ ఇన్స్టర్ ప్లాట్‌ఫారమ్‌ను పంచుకోనుంది. దీని డిజైన్, సాఫ్ట్‌వేర్ ఇతర మోడళ్ల కంటే భిన్నంగా, మరింత మోడ్రన్‌గా ఉండబోతున్నాయి.

లంచ్ అయిన తర్వాత కియా సోరెంటో హైబ్రిడ్.. హ్యుందాయ్ Ni1i, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, రెనాల్ట్ డస్టర్ వంటి కార్ల 7-సీటర్ వెర్షన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. హెక్టార్ హ్యాండ్‌లింగ్ కోసం FWD సిస్టమ్, సోరెంటోలో AWD కాన్ఫిగరేషన్ ఆప్షన్లు కూడా ఉండవచ్చు. చూడటానికి ఇవి సాధారణ పెట్రోల్ మోడళ్లలాగే ఉన్నప్పటికీ, వెనుక భాగంలో ఉండే Hybrid బ్యాడ్జ్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వీటిని ప్రత్యేకంగా నిలుపుతాయి.

Tags

Next Story