Kia Seltos : సిటీకా? హైవేకా? సెల్టోస్‌లో మీ డ్రైవింగ్ స్టైల్‌కు ఏ గేర్‌బాక్స్ కరెక్టో తెలుసుకోండి.

Kia Seltos : సిటీకా? హైవేకా? సెల్టోస్‌లో మీ డ్రైవింగ్ స్టైల్‌కు ఏ గేర్‌బాక్స్ కరెక్టో తెలుసుకోండి.
X

Kia Seltos : కియా సెల్టోస్ భారత మార్కెట్లో ఎంత పాపులరో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ కారులో ఉండే రకరకాల ఇంజన్, గేర్‌బాక్స్ ఆప్షన్లు కస్టమర్లను బాగా ఆకర్షిస్తాయి. ప్రస్తుతం కియా సెల్టోస్ తన 10 వేరియంట్లలో మూడు రకాల ఇంజన్లు, ఏకంగా నాలుగు రకాల ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను అందిస్తోంది. అయితే ఈ నాలుగింటిలో ఏది పవర్‌ఫుల్? ఏది ఎవరికి సెట్ అవుతుంది? అన్న కన్ఫ్యూజన్ చాలామందిలో ఉంటుంది. 2026 లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం కియా సెల్టోస్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ల పూర్తి వివరాలు తెలుసుకుందాం.

1. 6-స్పీడ్ iMT (క్లచ్ లేని మాన్యువల్)

ఇది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే.. ఇందులో క్లచ్ పెడల్ ఉండదు కానీ, మీరు గేర్లను మాన్యువల్‌గా మార్చుకోవాలి. ట్రాఫిక్‌లో పదే పదే క్లచ్ తొక్కే శ్రమ తప్పుతుంది కాబట్టి సిటీ డ్రైవింగ్‌కు ఇది చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. గేర్ మార్చేటప్పుడు సెన్సార్లు ఆటోమేటిక్‌గా క్లచ్‌ను ఆపరేట్ చేస్తాయి. ఇది మైలేజీని కూడా మెరుగుపరుస్తుంది.

2. IVT ఆటోమేటిక్ (స్మూత్ డ్రైవింగ్ కోసం)

ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ (IVT) అనేది 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది బెల్ట్-డ్రైవ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది, కాబట్టి గేర్లు మారేటప్పుడు ఎలాంటి కుదుపులు ఉండవు. చాలా సైలెంటుగా, స్మూత్‌గా సాగిపోయే ప్రయాణం కావాలనుకునే వారికి, ముఖ్యంగా సిటీలో రోజువారీ వాడకానికి ఇది బెస్ట్ ఆప్షన్.

3. 6-స్పీడ్ AT (నమ్మకమైన పవర్)

ఇది టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్. ఇది 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది చాలా కాలంగా ఉన్న సాంప్రదాయ ఆటోమేటిక్ సిస్టమ్ కాబట్టి చాలా నమ్మకమైనదిగా పరిగణిస్తారు. హైవేలపై లాంగ్ డ్రైవ్స్ చేసే వారికి, మంచి పవర్ తో పాటు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఇది అందిస్తుంది. డీజిల్ ఇంజన్ కాబట్టి మైలేజీ కూడా బాగానే వస్తుంది.

4. 7-స్పీడ్ DCT (పవర్‌ఫుల్ అండ్ ఫాస్ట్)

ఇక అన్నిటికంటే పవర్‌ఫుల్ ఆప్షన్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT). ఇది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో జత చేయబడింది. ఇందులో రెండు క్లచ్‌లు ఉంటాయి కాబట్టి గేర్లు కనురెప్పపాటులో మారిపోతాయి. కారును వేగంగా దూకించాలి అనుకునే స్పీడ్ లవర్స్ కు ఇది ఫేవరెట్. అయితే, భారీ ట్రాఫిక్‌లో గేర్‌బాక్స్ కాస్త వేడెక్కే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతుంటారు.

మీరు సిటీలో తిరుగుతూ మైలేజీ కోరుకుంటే IVT, స్పోర్టీ పర్ఫార్మెన్స్ కావాలంటే DCT, అదే లాంగ్ జర్నీలు చేస్తూ పవర్ కావాలనుకుంటే డీజిల్ ఆటోమేటిక్ ఎంచుకోవడం ఉత్తమం.

Tags

Next Story