Kia Seltos : 6 లక్షల మందికి ఇష్టమైన ఎస్‌యూవీ.. కియా సెల్టోస్ సృష్టించిన అరుదైన రికార్డు ఇదే.

Kia Seltos : ఆధునిక హంగులు, అద్భుతమైన ఫీచర్లతో భారతీయ రోడ్లపై సంచలనం సృష్టిస్తున్న కియా సెల్టోస్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఇప్పుడు ఏకంగా 6 లక్షల మంది భారతీయుల మనసు గెలుచుకుంది. దేశవ్యాప్తంగా సెల్టోస్ విక్రయాలు 6 లక్షల యూనిట్ల మార్కును దాటేశాయని కియా ఇండియా అధికారికంగా ప్రకటించింది. 2019లో భారత్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ కారు క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం.
ముఖ్యంగా సెల్టోస్ విక్రయాల్లో దాదాపు 29 శాతం మంది కస్టమర్లు టాప్ ఎండ్ వేరియంట్లనే ఎంచుకోవడం విశేషం. దీనిని బట్టి భారతీయులు ఇప్పుడు కేవలం బండి ఉంటే చాలు అనుకోవడం లేదని, అందులో అత్యాధునిక సేఫ్టీ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లు ఉండాలని కోరుకుంటున్నారని స్పష్టమవుతోంది. ఎంట్రీ లెవల్ నుంచి హై-ఎండ్ మోడల్ వరకు ప్రతి వేరియంట్‌కు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది.
ప్రస్తుతం సెల్టోస్ మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. 1.5 లీటర్ పెట్రోల్ (115 HP), 1.5 లీటర్ డీజిల్ (116 HP), మరింత పవర్‌ఫుల్ 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ (160 HP) ఇంజిన్లతో ఇది దూసుకుపోతోంది. డ్రైవింగ్ చేసేవారికి వీలుగా మాన్యువల్, ఆటోమేటిక్, డీసీటీ, సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్లను కియా అందిస్తోంది. రూ. 10.99 లక్షల ప్రారంభ ధరతో దొరికే ఈ ఎస్‌యూవీ.. స్టైల్, పర్ఫార్మెన్స్, టెక్నాలజీ కలగలిసిన ప్యాకేజీగా నిలుస్తోంది.
ఫీచర్ల విషయానికొస్తే సెల్టోస్ ఒక మినీ లగ్జరీ కార్ అని చెప్పవచ్చు. ఇందులో భారీ టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా వంటి సౌకర్యాలు ఉన్నాయి. వీటికి తోడు లెవల్-2 ADAS టెక్నాలజీ డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా మారుస్తుంది. టాటా సియెర్రా, హ్యుందాయ్ క్రెటా వంటి హేమాహేమీలకు గట్టి పోటీ ఇస్తూ, మధ్యతరగతి, సంపన్న వర్గాల ఫేవరెట్ ఎస్‌యూవీగా సెల్టోస్ తన స్థానాన్ని పదిలం చేసుకుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
