Kia Seltos : కియా సెల్టోస్ కొత్త అవతారం.. డిసెంబర్ 2025లో న్యూ జనరేషన్ లాంచ్.

Kia Seltos : కియా సెల్టోస్ కొత్త అవతారం.. డిసెంబర్ 2025లో న్యూ జనరేషన్ లాంచ్.
X

Kia Seltos : భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీలలో ఒకటైన కియా సెల్టోస్ త్వరలోనే సరికొత్త లుక్‌లో మార్కెట్‌లోకి రాబోతోంది. మీడియా నివేదికల ప్రకారం.. ఈ కొత్త తరం సెల్టోస్ డిసెంబర్ 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. అధికారికంగా లాంచ్ కాకముందే, ఇంటర్నెట్‌లో లీకైన డిజిటల్ చిత్రాలు కొత్త సెల్టోస్ డిజైన్‌ను వెల్లడించాయి. పెద్ద మార్పులతో రాబోతున్న ఈ కొత్త సెల్టోస్ డిజైన్, ఫీచర్లు, ఇంజన్ వివరాలు తెలుసుకుందాం.

కియా సెల్టోస్ న్యూ జనరేషన్ మోడల్ డిజైన్ పరంగా అనేక పెద్ద మార్పులతో రాబోతోంది. దీని డిజిటల్ ఫోటోలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఎస్‌యూవీలో ఇప్పుడు వర్టికల్ స్లాట్‌లతో కూడిన కొత్త గ్రిల్ కనిపిస్తుంది. బంపర్ కొత్త బ్లాక్ కలర్లో, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఫాగ్ ల్యాంప్‌ల డిజైన్ మారింది. బోనెట్‌పై కూడా షార్ప్ లైన్‌లు ఇచ్చారు.

టైర్ల పైభాగంలో ఉండే వీల్ ఆర్చెస్ మరింత మందంగా ఉన్నాయి. డోర్ హ్యాండిల్స్ ఇప్పుడు బాడీతో పాటు ప్లేన్‌గా ఉండే ఫ్లష్-టైప్ హ్యాండిల్స్‌గా మార్చారు. స్పై చిత్రాల ప్రకారం, ఈ కొత్త సెల్టోస్ కియా కొత్త ఆపోజిట్స్ యునైటెడ్ డిజైన్ థీమ్‌ను ఫాలో కానుంది. వెనుక భాగంలో కనెక్టెడ్ టెయిల్‌ల్యాంప్‌లు కూడా ఉండనున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో రాబోయే కొత్త సెల్టోస్ ప్రస్తుత మోడల్ కంటే దాదాపు 100 మి.మీ. పొడవుగా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఇది జీప్ కంపాస్ కంటే కూడా పొడవుగా ఉండవచ్చని అంచనా. అయితే, భారతీయ మోడల్ సైజ్ మీద క్లారిటీ రావాల్సి ఉంది.

కొత్త కియా సెల్టోస్ 2026 ఇంటీరియర్‌లో కంపెనీ పెద్ద మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. టెక్నాలజీ ఆధారిత ఫీచర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రిపోర్ట్‌ల ప్రకారం.. కొత్త సెల్టోస్‌లో ట్రినిటీ పనోరమిక్ డిస్‌ప్లే అనే టెక్నాలజీని వాడే అవకాశం ఉంది. ఇందులో మూడు స్క్రీన్లు ఉంటాయి. 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 5-అంగుళాల క్లైమేట్ కంట్రోల్ స్క్రీన్.

పైన చెప్పిన ఫీచర్లతో పాటు, క్యాబిన్‌ను మరింత విలాసవంతంగా మార్చడానికి కియా అనేక కొత్త ఫీచర్లను జోడించే అవకాశం ఉంది. డిజైన్, ఫీచర్లలో ఎన్ని మార్పులు చేసినా కొత్త సెల్టోస్‌లో ఇంజన్ ఆప్షన్లు మాత్రం పాతవే కొనసాగే అవకాశం ఉంది. కొత్త 2026 కియా సెల్టోస్‌లో ప్రస్తుత మోడల్‌లోని మూడు ఇంజన్ ఎంపికలు యథాతథంగా ఉంటాయి. అవి 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్. గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా ప్రస్తుత మోడల్‌లో ఉన్నట్టే ఉంటాయి. కియా సంస్థ 2027లో సెల్టోస్ హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఈ హైబ్రిడ్ సెల్టోస్‌లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటారును జత చేసే అవకాశం ఉంది.

Tags

Next Story