Kia : ఇండియాలో ఫస్ట్ టైం.. కాంపాక్ట్ హైబ్రిడ్ ఎస్‌యూవీని తీసుకురానున్న కియా

Kia : ఇండియాలో ఫస్ట్ టైం.. కాంపాక్ట్ హైబ్రిడ్ ఎస్‌యూవీని తీసుకురానున్న కియా
X

Kia : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. అదే సమయంలో హైబ్రిడ్ టెక్నాలజీ కూడా ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఆప్షన్ గా వినియోగదారుల్లో మారుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా కంపెనీ కియా రాబోయే 18 నెలల్లో భారతదేశంలో తమ మొదటి హైబ్రిడ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. కఠినమైన ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉండటమే కాకుండా, ఇప్పటివరకు జపనీస్ కంపెనీలు పెద్దగా దృష్టి పెట్టని మార్కెట్ గ్యాప్‌ను కియా ఈ చర్య ద్వారా భర్తీ చేయనుంది.

మీడియా నివేదికల ప్రకారం.. కియా మొదటగా సబ్-ఫోర్ మీటర్ హైబ్రిడ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. దీనితో పాటు, కంపెనీ మరో పెద్ద హైబ్రిడ్ ఎస్‌యూవీ పై కూడా పనిచేస్తోంది. ఈ రెండు మోడల్స్ విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు.. అయితే ప్రణాళికలలో మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది.

ఇప్పటివరకు భారతదేశంలో టయోటా, సుజుకి మాత్రమే హైబ్రిడ్ వాహనాలను అందిస్తున్నాయి. అయితే, వారి దృష్టి కేవలం పెద్ద కార్లకే పరిమితమైంది. అదే సమయంలో దేశీయ కంపెనీలు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలలో పెట్టుబడి పెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో, కియా కాంపాక్ట్ హైబ్రిడ్ సెగ్మెంట్లోకి ప్రవేశించడం వలన భారతీయ వినియోగదారులకు కొత్త ఆప్షన్ లభిస్తుంది. అలాగే మార్కెట్లో పోటీ కూడా పెరుగుతుంది.

భారతదేశంలో ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. పైగా ఈవీల ధరలు కూడా సాధారణ వినియోగదారులకు అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో హైబ్రిడ్ టెక్నాలజీ ఒక ప్రాక్టికల్ ఆప్షన్‌గా నిలుస్తుంది. ఈ టెక్నాలజీ ప్యూయెల్ ఎఫీషియెన్సీని పెంచడమే కాకుండా, వినియోగదారులకు బ్యాటరీ, పెట్రోల్ రెండింటి ప్రయోజనాన్ని అందిస్తుంది. ప్రస్తుతం, భారతదేశంలో హైబ్రిడ్ కార్ల వాటా ప్యాసింజర్ వాహనాల మార్కెట్‌లో కేవలం 2.5% మాత్రమే ఉంది. అందుకే కాంపాక్ట్ సెగ్మెంట్‌లో కియా హైబ్రిడ్ ఎంట్రీ చాలా కీలకంగా పరిగణించబడుతోంది. రాబోయే కాలంలో కియా ఈ వ్యూహం భారత ఆటోమొబైల్ మార్కెట్‌ను కొత్త దశకు తీసుకెళ్లగలదు.

Tags

Next Story