KTM 390 Adventure R : స్టాండర్డ్ మోడల్ కంటే తక్కువ ధరకే ..కేటీఎం నుంచి సరికొత్త అడ్వెంచర్ R లాంచ్.

KTM 390 Adventure R : స్టాండర్డ్ మోడల్ కంటే తక్కువ ధరకే ..కేటీఎం నుంచి సరికొత్త అడ్వెంచర్ R లాంచ్.
X

KTM 390 Adventure R : కేటీఎం బైక్ ప్రేమికులకు, ఆఫ్-రోడ్ అడ్వెంచర్ ఇష్టపడే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్. కేటీఎం తన సరికొత్త 390 అడ్వెంచర్ R బైక్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. హార్డ్‌కోర్ ఆఫ్-రోడింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ బైక్, స్టాండర్డ్ మోడల్ కంటే దాదాపు రూ. 20,000 తక్కువ ధరకే లభించడం విశేషం. పవర్‌ఫుల్ ఇంజిన్, అడ్వాన్స్‌డ్ సస్పెన్షన్, అదిరిపోయే గ్రౌండ్ క్లియరెన్స్‌తో వచ్చిన ఈ బైక్ వివరాలు చూద్దాం.

భారతీయ రోడ్లపై ముఖ్యంగా ఆఫ్-రోడ్ ప్రయాణాల్లో కేటీఎం అడ్వెంచర్ సిరీస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనిని మరింత బలోపేతం చేస్తూ కంపెనీ 390 అడ్వెంచర్ R మోడల్‌ను ప్రవేశపెట్టింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.3,77,915 గా నిర్ణయించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇది టాప్-స్పెక్ స్టాండర్డ్ మోడల్ (రూ.3.97 లక్షలు) కంటే సుమారు రూ.19,000 నుండి రూ.20,000 తక్కువ. ధర తగ్గడానికి ప్రధాన కారణం ఇందులో ట్యూబ్‌లెస్ టైర్లకు బదులుగా ట్యూబ్-టైప్ టైర్లను వాడటం. ఆఫ్-రోడింగ్‌లో టైర్లకు ఏదైనా సమస్య వస్తే రిపేర్ చేసుకోవడం సులభమని భావించే వారికి ఇది ప్లస్ పాయింట్.

ఈ బైక్‌లో సరికొత్త 398.63 cc, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ DOHC ఇంజిన్ ఉంది. ఇది 46 PS పవర్, 39 Nm టార్క్ జనరెట్ చేస్తుంది. దీనికి 6-స్పేడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఇందులో ఎలక్ట్రానిక్ త్రోటిల్ బాడీ,స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి రైడింగ్‌ను స్మూత్‌గా మారుస్తాయి. బైక్ బరువు 183 కేజీలు ఉన్నప్పటికీ, దీని పవర్-టు-వెయిట్ రేషియో అద్భుతంగా ఉంటుంది.

ఆఫ్-రోడ్ ప్రియుల కోసం కేటీఎం ఇందులో మెరుగైన సస్పెన్షన్‌ను అందించింది. ముందు భాగంలో 43 mm ఇన్వర్టెడ్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ మరియు వెనుక అడ్జస్టబుల్ మోనోషాక్ ఉన్నాయి. రెండూ 230 mm వీల్ ట్రావెల్‌ను అందిస్తాయి, ఇది స్టాండర్డ్ మోడల్ కంటే ఎక్కువ. ముఖ్యంగా ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 272 mm, సీటు ఎత్తు 880 mm. అంటే ఎత్తైన రోడ్లు, రాళ్లతో కూడిన దారుల్లో ఈ బైక్ చాలా సునాయాసంగా ప్రయాణిస్తుంది.

బైక్‌లో 5-అంగుళాల ఫుల్ కలర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇది KTM కనెక్ట్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అవుతుంది, దీనివల్ల రైడర్లు కాల్స్, మ్యూజిక్ మరియు నావిగేషన్‌ను స్క్రీన్‌పైనే చూడవచ్చు. భద్రత కోసం డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఉంది, ఇందులో ఆఫ్-రోడ్ ఏబీఎస్ మోడ్ కూడా ఇచ్చారు. ఇది వెనుక చక్రంపై కంట్రోల్ ను అందిస్తూ గరుకు ఉపరితలాలపై మంచి గ్రిప్ ఇస్తుంది. క్యూ3 సేల్స్ పెరిగిన తరుణంలో, కేటీఎం ఈ మోడల్‌తో యువతను మరింత ఆకట్టుకోనుంది.

Tags

Next Story