KTM : కేటీఎం డ్యూక్ కొత్త అవతారం.. అదిరిపోయే రంగులతో అప్‌డేట్ అయిన 200, 250 మోడల్స్.

KTM : కేటీఎం ఇండియా (KTM India) తన పాపులర్ మోడల్స్ అయిన డ్యూక్ 200, డ్యూక్ 250 బైక్‌లను సరికొత్త రంగులతో 2026 కోసం అప్‌డేట్ చేసింది. గ్లోబల్ మార్కెట్‌లో ఉన్న కలర్ ఆప్షన్లను ఇప్పుడు ఇండియన్ మార్కెట్లోకి కూడా తీసుకువచ్చింది. కేవలం రంగులు మార్చడమే కాకుండా, డ్యూక్ 200 మోడల్‌లో కొన్ని కీలకమైన మెకానికల్ మార్పులను కూడా కేటీఎం చేపట్టింది.
కొత్త రంగులు, డిజైన్
KTM 250 Duke: ఈ బైక్ ఇప్పుడు సిల్వర్ మెటాలిక్, స్లేట్ గ్రే రంగుల్లో లభిస్తుంది. సిల్వర్ మెటాలిక్ షేడ్ బైక్‌కు మరింత షార్ప్ లుక్ ఇస్తుండగా, స్లేట్ గ్రే రంగు చాలా క్లాసీగా, మెచ్యూర్డ్‌గా కనిపిస్తోంది.
KTM 200 Duke: దీనికి అట్లాంటిక్ బ్లూ అనే అదిరిపోయే కొత్త కలర్ ఇచ్చారు. డీప్ మెటాలిక్ బ్లూ ప్యానెల్స్‌తో పాటు కేటీఎం సిగ్నేచర్ ఆరెంజ్ కలర్ వీల్స్ ఈ బైక్‌కు మంచి కాంట్రాస్ట్‌ను ఇస్తున్నాయి.
డ్యూక్ 200 లో కీలక మార్పులు
ఈసారి కేవలం కలర్ మాత్రమే కాకుండా, డ్యూక్ 200లో హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్స్ కూడా చేశారు. ఇందులో ఇప్పుడు 320mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్ (గతంలో 300mm ఉండేది), బరువు తక్కువగా ఉండే 5-స్పోక్ అలాయ్ వీల్స్‌ను అమర్చారు. ఇవి డ్యూక్ 390 మోడల్ నుంచి తీసుకున్నవి. దీనివల్ల బైక్ హ్యాండ్లింగ్ మరింత మెరుగుపడటమే కాకుండా బరువు కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంది.
ఎక్స్-షోరూమ్ ధరల ప్రకారం KTM బైకుల ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. రంగులు, కొన్ని ఫీచర్ల అప్‌డేట్ల కారణంగా ఈ మార్పులు వచ్చినట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
KTM 200 Duke కొత్త ధర సుమారు రూ.1,93,854 గా నిర్ణయించబడింది. ఇది గత ధరతో పోలిస్తే రూ.2,530 పెరుగుదల. చిన్న మొత్తంలో పెరుగుదల ఉన్నప్పటికీ, ఈ సెగ్మెంట్‌లో 200 Duke ఇప్పటికీ యువతకు ఆకర్షణీయమైన ఎంపికగానే ఉంది.
KTM 250 Duke విషయానికి వస్తే, దీని కొత్త ధర సుమారు రూ.2,13,618. ఈ మోడల్ ధరలో పెద్దగా మార్పు లేదు. 250 Duke తన పవర్, ప్రీమియం ఫీచర్లు, పనితీరుతో మిడ్-సెగ్మెంట్ స్ట్రీట్ నేకెడ్ బైక్‌లలో బలమైన స్థానాన్ని కొనసాగిస్తోంది. మొత్తానికి ఈ స్వల్ప ధర మార్పులు మార్కెట్ డిమాండ్, అప్‌డేట్లను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయాలుగా భావిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
