రిలయన్స్‌ రిటైల్‌కు పెద్ద మొత్తంలో పెట్టుబడులు

రిలయన్స్‌ రిటైల్‌కు పెద్ద మొత్తంలో పెట్టుబడులు

రిలయన్స్‌ రిటైల్‌కు ఈవారం పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చాయి. రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌లో జనరల్‌ అట్లాంటిక్‌ 3675 కోట్లను ఇన్వెస్ట్‌ చేసి 0.84శాతం వాటాను కొనుగోలు చేసింది. ఆ తర్వాత సిల్వర్‌లేక్‌ కూడా రెండో దఫా మరో 1875 కోట్లను ఇన్వెస్ట్‌ చేసింది. దీంతో రిలయన్స్‌ రిటైల్‌లో సిల్వర్‌లేక్‌ పెట్టుబడి విలువ 9375 కోట్లకు చేరింది. ఇక అబుదాబీకి చెందిన సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌ ముబదాల.. తాజాగా రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌లో 6,247.5 కోట్లు రూపాయలను ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా 1.4 శాతం వాటాను చేజిక్కించుకుంది. గత నెల రోజుల్లోనే ముకేశ్‌ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్‌ రిటైల్‌లో నాలుగు పీఈ సంస్థలు కలిసి 24 వేల 847.5 కోట్లతో 5.65 శాతం వాటా కొనుగోలు చేశాయి.

Tags

Read MoreRead Less
Next Story