LAYOFFS: టెక్ రంగంలో ఉద్యోగాల ఊచకోత

LAYOFFS: టెక్ రంగంలో ఉద్యోగాల ఊచకోత
X
రెండేళ్లుగా టెకీలకు ప్రమాద ఘంటికలు... భారీగా తొలగిస్తున్న దిగ్గజ సంస్థలు

టెక్ రం­గా­న్ని సు­దీ­ర్ఘ­కా­లం­గా గ్లో­బ­ల్‌ ఎకా­న­మీ­కి వె­న్ను దన్ను­గా భా­విం­చా­రు. కానీ గత రెం­డే­ళ్లు­గా ఆ రం­గం­లో­నే ఉద్యో­గా­ల­కు ప్ర­మాద ఘం­టి­క­లు మో­గు­తు­న్నా­యి. ము­ఖ్యం­గా 2024 చి­వ­రి త్రై­మా­సి­కం నుం­చీ 2025 మొ­ద­టి వరకూ పరి­స్థి­తి మరింత సం­క్లి­ష్టం­గా మా­రిం­ది. ఇం­టె­ల్, గూ­గు­ల్, మై­క్రో­సా­ఫ్ట్, అమె­జా­న్‌ వంటి గ్లో­బ­ల్‌ టె­క్‌ ది­గ్గ­జా­లు ఉద్యో­గు­ల­ను వదు­లు­కో­వ­డం అనే­క­మం­ది­లో భయం, అని­శ్చి­తి­ని పెం­చు­తోం­ది. ఈ ఏడా­ది తొలి ఆ నె­ల­ల్లో 62,000 మం­ది­కి పైగా ఉద్యో­గు­లు ఉద్యో­గా­లు కో­ల్పో­యా­రు. ఇప్ప­టి­దా­కా వచ్చిన లే­ఆ­ఫ్ ప్ర­క­ట­నల ప్ర­కా­రం, ఈ సం­ఖ్య జూలై కల్లా లక్ష మా­ర్కు­ను దాటి వె­ళ్లే అవ­కా­శం ఉంది.

ఎందుకు ఈ ఊచకోత?

ఆర్టి­ఫి­షి­య­ల్‌ ఇం­టె­లి­జె­న్స్‌ (AI) ప్ర­భా­వం: అనేక కం­పె­నీ­లు ఇప్పు­డు AI ఆధా­రిత టూ­ల్స్‌­ను వి­ని­యో­గి­స్తూ మానవ వన­రు­ల­పై ఆధా­ర­ప­డే తత్వా­న్ని తగ్గి­స్తు­న్నా­యి. మానవ మే­ధ­స్సు­తో జరి­గే పను­ల­ను యం­త్రా­లు, ఆల్గో­రి­థం­ల­తో స్వ­యం­చా­ల­కం­గా ని­ర్వ­హిం­చ­డం వల్ల ఉద్యో­గు­లు అవ­స­రం లేని పరి­స్థి­తి ఏర్ప­డిం­ది. కొ­త్త వ్యా­పార మో­డ­ళ్ల అన్వే­షణ: వృ­ద్ధి లేని మా­ర్కె­ట్ల­లో టె­క్‌ సం­స్థ­లు ఇప్పు­డు ఆదాయ మా­ర్గా­ల­ను వి­స్త­రిం­చేం­దు­కు వ్యూ­హా­త్మక మా­ర్పు­లు చే­ప­డు­తు­న్నా­యి. ఇది కం­పె­నీ మూ­ల­వ్య­వ­స్థ­లో మా­ర్పు­ల­కు దా­రి­తీ­స్తోం­ది. ఫలి­తం­గా, పాత పని­వి­ధా­నా­ల్లో ఉన్న ఉద్యో­గు­ల­పై ము­ప్పు పె­రి­గిం­ది. గ్లో­బ­ల్‌ ఆర్థిక అని­శ్చి­తి: అమె­రి­కా, యూ­ర­ప్‌ వంటి కీలక మా­ర్కె­ట్ల­లో మాం­ద్యం సం­కే­తా­లు, ద్ర­వ్యో­ల్బ­ణం, వడ్డీ రే­ట్ల పెం­పు వంటి అం­శా­లు కం­పె­నీల ఖర్చు తగ్గిం­పు ని­ర్ణ­యా­ల­కు దా­రి­తీ­స్తు­న్నా­యి.

ఉద్యోగాల కోతలు ఏ సంస్థలో ఎలా?

ఇంటెల్‌: 2025కి ముందు $3 బిలియన్ల వ్యయం తగ్గించాలన్న లక్ష్యంతో పలుచోట్ల ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.

గూగుల్: ఇటీవల గ్లోబల్ రిక్రూట్‌మెంట్ టీం నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది.

మైక్రోసాఫ్ట్: గేమింగ్‌, క్లౌడ్‌ సెగ్మెంట్లలో పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో వందలాది ఉద్యోగాలను కోతకు గురిచేసింది.

అమెజాన్‌: డివైజ్‌, ఫ్రెష్‌, స్టోర్స్‌ విభాగాల్లో ఉద్యోగులను తొలగించడంతో పాటు, పునఃనిర్వాహణ ప్రక్రియ కొనసాగుతోంది.

బ్లాక్‌ (Fintech), బ్లూ ఆరిజన్‌ (Space-tech), SAP, Dell, eBay వంటి సంస్థలు కూడా కార్యకలాపాల్లో మినిమైజేషన్‌ స్ట్రాటజీ అమలు చేస్తున్నాయి.

భారతీయ టెక్‌ రంగంపై ప్రభావం:

ఇం­డి­యా­లో­ని టెక్ కం­పె­నీ­లు ఇంకా బహు­ళ­జా­తీయ సం­స్థల సర్వీ­స్ సెం­ట­ర్లు ఈ ప్ర­భా­వా­న్ని ప్ర­త్య­క్షం­గా ఎదు­ర్కొం­టు­న్నా­యి. టాప్ ఐటీ కం­పె­నీ­లైన ఇన్ఫో­సి­స్‌, వి­ప్రో, హె­చ్‌­సి­ఎ­ల్‌, టీ­సీ­ఎ­స్‌­ల­లో నూతన ని­యా­మ­కాల జా­ప్యం, ఇం­ట­ర్న్‌­షి­ప్‌ల ని­లి­పి­వేత వంటి సం­కే­తా­లు ఇప్ప­టి­కే కని­పి­స్తు­న్నా­యి.

భవిష్యత్తు దారి?

టెక్ రంగంలో ఉద్యోగాల ఊచకోతటెక్ రంగంలో ఉద్యోగాల ఊచకోతఈ తరహా ఉద్యోగ కో­త­లు పరి­శ్ర­మల మా­ర్పు­ను సూ­చి­స్తు­న్న­ప్ప­టి­కీ, అదే సమ­యం­లో కొ­త్త అవ­కా­శా­ల­కు కూడా ద్వా­రా­లు తె­రి­చే అవ­కా­శం ఉంది. AI, డేటా సై­న్స్‌, సై­బ­ర్ సె­క్యూ­రి­టీ వంటి వి­భా­గా­ల్లో నై­పు­ణ్యా­ల­ను పెం­పొం­దిం­చు­కుం­టే యు­వ­త­కు కొ­త్త అవ­కా­శా­లు లభిం­చొ­చ్చు. ఇప్ప­టి పరి­స్థి­తి­ని బట్టి చూ­స్తే… “స్టె­బి­లి­టీ” అనే పదం టెక్ రం­గం­లో అప­రి­చి­తం­గా­నే మి­గి­లే సూ­చ­న­లు కని­పి­స్తు­న్నా­యి.

Tags

Next Story