Lenskart Smart Glasses : ఇక ఫోన్‌తో పనిలేదు.. కళ్ళజోడుతోనే యూపీఐ పేమెంట్.

Lenskart Smart Glasses : రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో లెన్స్‌కార్ట్ ఒక అద్భుతమైన ఆవిష్కరణతో ముందుకు వచ్చింది. త్వరలో విడుదల చేయబోయే తమ బీ కెమెరా స్మార్ట్‌గ్లాసెస్‌లో డైరెక్ట్ యూపీఐ పేమెంట్స్ అనే సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ సహాయంతో కస్టమర్లు తమ కళ్లజోడు ద్వారానే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, వెంటనే డబ్బులు చెల్లించవచ్చు. దీని కోసం ఫోన్ నంబర్ కానీ, మ్యానువల్‌గా పిన్ ఎంటర్ చేయడం కానీ అవసరం లేదు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో కంపెనీ ఈ విషయాన్ని ప్రకటించింది.
యూపీఐ పేమెంట్ ఎలా పనిచేస్తుంది?
ఈ స్మార్ట్‌గ్లాసెస్‌లోని డైరెక్ట్ యూపీఐ ఫీచర్, వినియోగదారుడి బ్యాంక్ ఖాతాతో సురక్షితంగా అనుసంధానించబడి ఉంటుంది. పేమెంట్ చేయడానికి, కేవలం వాయిస్ కమాండ్ ద్వారా అథంటికేషన్ చేసి ట్రాన్సాక్షన్ పూర్తి చేయవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ సర్కిల్ ఫీచర్ ద్వారా ఈ కళ్లజోడు నేరుగా వ్యక్తి బ్యాంక్ ఖాతాకు అనుసంధానం అవుతుంది. ప్రతి లావాదేవీ సురక్షితంగా, గోప్యంగా, రియల్ టైం అథంటికేషన్‌తో జరుగుతుందని కంపెనీ తెలిపింది.ఈ వినూత్న ఫీచర్ వల్ల షాపింగ్ చేసేటప్పుడు ప్రతీసారి జేబులోంచి ఫోన్ తీయాల్సిన అవసరం, లేదా పిన్ ఎంటర్ చేయాల్సిన శ్రమ తప్పుతుంది.
ఈ స్మార్ట్‌గ్లాసెస్‌లో అత్యాధునిక పాయింట్-ఆఫ్-వ్యూ (PoV) కెమెరా, బిల్ట్-ఇన్ ఏఐ (AI) ఫీచర్లు ఉన్నాయి. ఈ యూపీఐ ఫంక్షనాలిటీతో దృష్టి, తెలివితేటలు, వాణిజ్యాన్ని అనుసంధానించాలని లెన్స్‌కార్ట్ భావిస్తోంది. పరిశ్రమ అంచనాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌గ్లాస్ అమ్మకాలు 2022 నుండి మూడు రెట్లు పెరిగాయి. భారతదేశంలో ఏఆర్, వీఆర్ ఐవేర్ మార్కెట్ విలువ 2024లో $608 మిలియన్లకు చేరింది. గేమింగ్, హెల్త్‌కేర్, విద్యలో పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇది 2033 నాటికి $1.67 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com