Li-Fi Internet : అమెరికాలో తొలి లైఫై ఇంటర్నెట్.. హిస్టరీ క్రియేట్ చేసిన భారతీయ కంపెనీ.

Li-Fi Internet : అమెరికాలో తొలి లైఫై ఇంటర్నెట్.. హిస్టరీ క్రియేట్ చేసిన భారతీయ కంపెనీ.
X

Li-Fi Internet : భారతదేశానికి చెందిన నయావ్ వైర్‌లెస్ టెక్నాలజీస్ సంస్థ అంతర్జాతీయంగా మన దేశ ఖ్యాతిని పెంచింది. ఈ సంస్థ న్యూయార్క్‌లో లైఫై ఇంటర్నెట్ సిస్టంను విజయవంతంగా ఏర్పాటు చేసింది. ఇది అమెరికాలో మొట్టమొదటి కమర్షియల్ లైఫై సిస్టమ్ గా గుర్తింపు పొందింది. జెస్కో వెంచర్ ల్యాబ్స్ అనే బిజినెస్ కన్సల్టింగ్ కంపెనీ సహకారంతో.. నయావ్ వైర్‌లెస్ టెక్నాలజీస్ సంస్థ న్యూయార్క్ సిలికాన్ హార్లెమ్ ఆఫీస్‌లో ఈ లైఫై వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.

లైఫై ఇంటర్నెట్ అంటే ఏమిటి?

లైఫై (Li-Fi) అనేది డేటాను బదిలీ చేసే ఒక కొత్త సాంకేతిక మాధ్యమం. ఇది వైఫైతో పోల్చదగినదే అయినా, దానికంటే భిన్నంగా ఉంటుంది. వైఫై రేడియో ఫ్రీక్వెన్సీని ఉపయోగించి డేటాను పంపిస్తే, లైఫై కాంతిని ఉపయోగించి డేటాను ప్రసారం చేస్తుంది.

లైఫై టెక్నాలజీలో అధిక వేగంతో కూడిన ఇంటర్నెట్ లభిస్తుంది. అంతేకాకుండా, దీనికి సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. ఎలక్ట్రోమ్యాగ్నెట్ అడ్డంకులు తక్కువగా ఉంటాయి. అయితే, వైఫై అంత విస్తృత పరిధి లైఫైకి ఉండదు. LED లైట్ పడే ప్రదేశం వరకే ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. అందుకే, ఆసుపత్రులు వంటి నిర్దిష్ట వాతావరణాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. లైఫై ప్లస్ పాయింట్స్ ఏమిటంటే, ఇంటర్నెట్ వేగం చాలా అధికంగా ఉండడం, తక్కువ అడ్డంకులు లేకుండా ఇంటర్నెట్‌ను అందించడం.

భారతీయ కంపెనీకి దక్కిన గౌరవం నయావ్ వైర్‌లెస్ టెక్నాలజీస్ సంస్థ లైఫై టెక్నాలజీ పేటెంట్ కలిగి ఉన్న ప్రపంచంలోని కొన్ని కంపెనీలలో ఒకటి. అమెరికాలో మొట్టమొదటి కమర్షియల్ లైఫై వ్యవస్థాపనలో తమ కంపెనీ భాగం కావడం భారతదేశానికి గర్వకారణమని ఆ కంపెనీ సహ-వ్యవస్థాపకుడు హార్దిక్ సోని తెలిపారు.

Tags

Next Story