LIC : మిడిల్ క్లాస్ వాళ్లకు ఎల్ఐసీ దీపావళి గిఫ్ట్.. కొత్తగా 2 రిస్క్-ఫ్రీ పథకాలు లాంచ్.

LIC : దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దీపావళి పండుగకు కొద్ది రోజుల ముందు సామాన్య ప్రజలకు, మధ్యతరగతి వర్గాలకు ఒక శుభవార్త అందించింది. వారి పొదుపు, ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎల్‌ఐసీ తాజాగా రెండు కొత్త బీమా పథకాలను ప్రారంభించింది. ఈ రెండు పథకాలు రిస్క్-ఫ్రీ, షేర్ మార్కెట్‌తో సంబంధం లేనివి. అంతేకాక, ఈ పథకాలలో బోనస్ అంశం కూడా ఉండదు. ఈ రెండు కొత్త పథకాలు అక్టోబర్ 15 నుండి అందుబాటులోకి వస్తాయని ఎల్‌ఐసీ అధికారికంగా ప్రకటించింది.
మొదటి పథకం: ఎల్‌ఐసీ జన సురక్ష
ఎల్‌ఐసీ తీసుకొచ్చిన ఈ జన సురక్ష పథకం, ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాల వారి కోసం రూపొందించబడిన తక్కువ ఖర్చు గల బీమా పథకం. ఇది నాన్-పార్టిసిపేటింగ్, నాన్-లింక్డ్ బీమా పథకం. అంటే, ఈ పథకం షేర్ మార్కెట్ లేదా కంపెనీ లాభాలుతో ముడిపడి ఉండదు. ఇది ఒక మైక్రో-ఇన్సూరెన్స్ పథకం కావడంతో, ఆర్థికంగా బలహీన వర్గాల అవసరాలకు అనుగుణంగా తక్కువ ప్రీమియం, అనుకూలమైన చెల్లింపు ఆప్షన్లతో దీన్ని రూపొందించారు.
రెండవ పథకం: ఎల్‌ఐసీ బీమా లక్ష్మి
మధ్యతరగతి వ్యక్తుల వ్యక్తిగత అవసరాలను తీర్చడానికి ఎల్‌ఐసీ బీమా లక్ష్మి అనే మరో కొత్త లైఫ్ ఇన్సూరెన్స్, సేవింగ్ పథకాన్ని ప్రారంభించింది. ఇది కూడా జన సురక్ష మాదిరిగానే నాన్-పార్, నాన్-లింక్డ్ ప్లాన్. అంటే, ఈ పథకం ద్వారా వచ్చే రాబడి మార్కెట్ పనితీరుపై ఆధారపడదు. ఇందులో బోనస్ ప్రయోజనాలు ఉండవు. ఈ పథకం లైఫ్ ఇన్సూరెన్స్‌తో పాటు మెచ్యూరిటీ సమయంలో పొదుపు మొత్తాన్ని కూడా అందిస్తూ, పాలసీదారుల భవిష్యత్తు అవసరాలను తీర్చడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఎల్‌ఐసీ షేర్లలో వృద్ధి
ఈ రెండు కొత్త పథకాల ప్రకటన వెలువడిన నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్‌లో స్వల్ప బలహీనత ఉన్నప్పటికీ, ఎల్‌ఐసీ షేర్ ధర పెరిగింది. ఎల్‌ఐసీ షేరు ధర రూ.904.15 గరిష్ట స్థాయికి చేరుకుంది. గత ఆరు నెలల కాలంలో ఎల్‌ఐసీ షేరు సుమారు 17 శాతం పెరిగింది. అయితే, గత ఏడాది మొత్తం, ఈ ఏడాది ప్రారంభం నుండి చూస్తే షేర్ పనితీరు కాస్త నిరాశపరిచినప్పటికీ కొత్త పథకాల ప్రకటన మార్కెట్‌లో సానుకూల ప్రభావాన్ని చూపింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com