LIC : ఒక్కసారి డబ్బు కడితే చాలు..జీవితాంతం లైఫ్ సెటిల్..LIC కొత్త ప్లాన్ వచ్చేసింది.

LIC : భారతీయ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ కొత్త ఏడాది 2026 ప్రారంభంలోనే తన కోట్లాది మంది కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆగిపోయిన పాత పాలసీలను మళ్ళీ ప్రారంభించుకునే అద్భుత అవకాశం ఇవ్వడమే కాకుండా, కొత్తగా ఒకేసారి ప్రీమియం కట్టే వెసులుబాటు ఉన్న సరికొత్త ప్లాన్‌ను కూడా లాంచ్ చేసింది. ఎల్‌ఐసీ తన కస్టమర్ల కోసం జీవన్ ఉత్సవ్ సింగిల్ ప్రీమియం పేరుతో సరికొత్త బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇది జనవరి 12, 2026 నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏంటంటే.. ప్రతి నెల లేదా ప్రతి ఏటా ప్రీమియం కట్టే తలనొప్పి ఉండదు. కేవలం ఒక్కసారి డబ్బు జమ చేస్తే చాలు, జీవితాంతం భద్రతతో పాటు పొదుపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఇది మార్కెట్ రిస్క్‌తో సంబంధం లేని, లాభాల్లో వాటా లేని వ్యక్తిగత హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్.
చాలామంది ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదా మర్చిపోవడం వల్ల సమయానికి ప్రీమియం కట్టలేక తమ పాలసీలను పోగొట్టుకుంటారు. అలాంటి వారి కోసం ఎల్‌ఐసీ ఒక ప్రత్యేక రివైవల్ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఈ అద్భుత అవకాశం జనవరి 1, 2026 నుంచి మార్చి 2, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పాత పాలసీని మళ్ళీ మొదలుపెట్టడం వల్ల పాత బోనస్‌లు, కవరేజ్ అన్నీ అలాగే కొనసాగుతాయి. కొత్త పాలసీ తీసుకునే కంటే పాత దాన్ని పునరుద్ధరించుకోవడమే తెలివైన పని అని నిపుణులు చెబుతున్నారు.
ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా లేట్ ఫీజుపై ఎల్‌ఐసీ భారీగా డిస్కౌంట్లు ఇస్తోంది. నాన్-లింక్డ్, మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్ల మీద ఈ ఆఫర్ వర్తిస్తుంది. లేట్ ఫీజులో గరిష్టంగా 30% వరకు రాయితీ పొందవచ్చు. ఒక లక్ష రూపాయల లోపు బకాయి ఉన్న ప్రీమియంలకు 30% రాయితీ (గరిష్టంగా రూ. 3,000). లక్ష నుంచి మూడు లక్షల వరకు బకాయి ఉంటే 30% రాయితీ (గరిష్టంగా రూ. 4,000). మూడు లక్షల పైన బకాయి ఉన్నవారికి గరిష్టంగా రూ. 5,000 వరకు రాయితీ లభిస్తుంది. ముఖ్యంగా పేదలకు ఉపయోగపడే మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్ల మీద లేట్ ఫీజును 100% రద్దు చేయడం విశేషం.
అయితే, అన్ని పాలసీలను మళ్ళీ ప్రారంభించడం కుదరదు. మొదటిసారి ప్రీమియం కట్టడం ఆపేసిన తేదీ నుంచి 5 ఏళ్ల లోపు ఉన్న పాలసీలను మాత్రమే పునరుద్ధరించుకోవచ్చు. అలాగే పాలసీ కాలపరిమితి ముగిసి ఉండకూడదు. కస్టమర్ ఆరోగ్య పరిస్థితిని బట్టి కొన్నిసార్లు మెడికల్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన తదుపరి వివరాల కోసం కస్టమర్లు తమ సమీపంలోని ఎల్‌ఐసీ బ్రాంచ్ లేదా ఏజెంట్‌ను సంప్రదించవచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

