మీకు గ్యాస్ సబ్సిడీ ఎంత వస్తోంది? ఏ అకౌంట్‌లో ఎంత పడుతుంది? క్షణాల్లో తెలుసుకోండి!

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా? మీరు గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? అయితే మీ గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై ఎంత సబ్సిడీ వస్తోందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ విషయాలను ఇప్పుడు మీరు క్షణంలో తెలుసుకోవచ్చు. దీనికోసం ముందుగా మీరు ఇండేన్ గ్యాస్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. లేదా https://cx.indianoil.in/EPICIOCL/faces/GrievanceMainPage.jspx లింక్ సాయంతో డైరెక్ట్ గా కూడా వెబ్‌సైట్‌లోకి వెళ్లొచ్చు.
ఈ లింక్ ఓపెన్ చేయగానే ఇక్కడ కంప్లైంట్ బాక్స్ కనిపిస్తుంది. ఇందులో సబ్సిడీ స్టేటస్ అని రాయాలి. తర్వాత ప్రొసీడ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు సబ్సిడీ సంబంధిత ఫిర్యాదులు అనే ఆప్షన్ ఎంచుకోవాలి. మళ్లీ ఇప్పుడు సబ్సిడీ రావడం లేదనే ఆప్షన్ ఓకే చేయాలి.
ఇది ఓపెన్ చేయగానే కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా కాకపోయిన ఎల్‌పీజీ ఐడీ ఉంటే దాన్ని కూడా ఎంటర్ చేయొచ్చు. ఆ తర్వాత సబ్‌మిట్ చేయాలి. ఇప్పుడు మీ గ్యాస్ ఏజెన్సీ కి సంబంధించిన వివరాలన్నీ స్క్రీన్‌పై కనిపిస్తాయి.
ఇందులో మీరు గ్యాస్ సిలిండర్ ఎప్పుడెప్పుడు బుక్ చేశారు? మీకు ఎంత సబ్సిడీ వచ్చింది? ఏ అకౌంట్‌లోకి సబ్సిడీ డబ్బులు వచ్చాయి? వంటి అంశాలన్నీ తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు డబ్బులు రాకపోతే మీరు నేరుగా ఇక్కడి నుంచే ఫిర్యాదు కూడా చేయొచ్చు. కింద కంప్లైంట్ బాక్స్ కూడా ఉంటుంది.
Also Read :
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com