Mahindra XEV 9e : మహీంద్రా బంపర్ ఆఫర్.. రూ.3.80 లక్షలు తగ్గిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.

Mahindra XEV 9e : మహీంద్రా బంపర్ ఆఫర్.. రూ.3.80 లక్షలు తగ్గిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.
X

Mahindra XEV 9e : మహీంద్రా కంపెనీ డిసెంబర్ నెల కోసం తమ ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిపై భారీ ఆఫర్‌లను ప్రకటించింది. ముఖ్యంగా వారి ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన మహీంద్రా XEV 9e పై కొనుగోలుదారులకు ఏకంగా రూ.3.80 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ డిస్కౌంట్లలో క్యాష్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, కార్పొరేట్ స్కీమ్‌లు, ఎంచుకున్న మోడళ్లపై ఉచిత పీపీఎఫ్ కోటింగ్, ఎక్స్‌టెండెడ్ వారంటీ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆఫర్ పరిమిత సమయం వరకే అందుబాటులో ఉంటుంది. రూ.3.80 లక్షల తగ్గింపు Pack Three వేరియంట్‌పై లభిస్తుంది. ఇతర వేరియంట్లపై కూడా రూ.1.55 లక్షల నుంచి రూ.3.10 లక్షల వరకు తగ్గింపులు ఉన్నాయి.

పవర్‌ఫుల్ బ్యాటరీ, భారీ రేంజ్

మహీంద్రా XEV 9e ఎస్‌యూవీని పెద్ద, ప్రీమియం ఎలక్ట్రిక్ కారుగా రూపొందించారు. ఇది 4789ఎంఎం పొడవు, 1907ఎంఎం వెడల్పు, 1694ఎంఎం ఎత్తు, 2775ఎంఎం వీల్‌బేస్‌తో విశాలంగా ఉంటుంది. ఇందులో 663 లీటర్ల బూట్ స్పేస్, 150 లీటర్ల ఫ్రంక్ కూడా ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ రెండు ప్రధాన బ్యాటరీ వేరియంట్లలో లభిస్తుంది.

59kWh బ్యాటరీ వేరియంట్: ఇది 231hp పవర్, 380Nm టార్క్ అందిస్తూ, 542 కి.మీ.ల MIDC రేంజ్ ఇస్తుంది. 140kW ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 20 నిమిషాల్లో ఛార్జింగ్ అవుతుంది.

79kWh లాంగ్-రేంజ్ వేరియంట్: ఈ టాప్ వేరియంట్ 286hp పవర్, 380Nm టార్క్‌తో పాటు 656 కి.మీ.ల MIDC రేంజ్ ను ఇస్తుంది. ఇది 0 నుంచి 100 కి.మీ.ల వేగాన్ని కేవలం 6.8 సెకన్లలో అందుకుంటుంది. దీనికి 170kW ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ ఉంది.

వివిధ వేరియంట్‌లపై లభించే ప్రయోజనాలు

ఈ ఎస్‌యూవీ వివిధ వేరియంట్లపై కొనుగోలుదారులు వివిధ రకాల ప్రయోజనాలు పొందవచ్చు. Pack One వేరియంట్‌పై సుమారు రూ.1.55 లక్షలు, Pack Two 59 పై రకూ.2.80 లక్షలు, Pack Two 79 పై రూ.3.10 లక్షలు, అత్యధికంగా Pack Three పై రూ.3.80 లక్షల వరకు మొత్తం ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో క్యాష్ డిస్కౌంట్‌తో పాటు, సెలక్టెడ్ వేరియంట్‌లలో కాంప్లిమెంటరీ పీపీఎఫ్ కోటింగ్, ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా చేర్చారు. అధిక డిస్కౌంట్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ డిసెంబర్ ఆఫర్ ఒక అద్భుతమైన అవకాశం.

Tags

Next Story