Mahindra : మార్చి 10న బుకింగ్స్.. ఏప్రిల్ లో డెలివరీ.. కేవలం 135 సెకన్లలోనే ఖాళీ అయిన మోడల్ మళ్ళీ వస్తోంది.

Mahindra : మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి వచ్చిన మోస్ట్ స్టైలిష్ ఎలక్ట్రిక్ కారు BE6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ మరోసారి భారత రోడ్లపైకి రాబోతోంది. గతేడాది ఆగస్టులో వార్నర్ బ్రదర్స్ డిసి కామిక్స్‌తో జతకట్టి కేవలం 300 యూనిట్లను మాత్రమే లాంచ్ చేయగా, డిమాండ్ చూసి వాటిని 999 కి పెంచారు. ఆశ్చర్యకరంగా ఆ 999 కార్లు కేవలం 135 సెకన్లలోనే అమ్ముడైపోయి రికార్డు సృష్టించాయి. ఇప్పుడు కస్టమర్ల నుంచి వస్తున్న విపరీతమైన రిక్వెస్ట్‌లను దృష్టిలో ఉంచుకుని, మహీంద్రా మరికొన్ని యూనిట్లను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. ఈ అదిరిపోయే కారు బుకింగ్స్ మార్చి 10, 2026న కేవలం ఒకే ఒక్క రోజు కోసం ఓపెన్ కానున్నాయి. దీని డెలివరీలు ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం కానున్నాయి.
బ్యారీ డిజైన్.. డార్క్ నైట్ లుక్
ఈ కారు డిజైన్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. సాటిన్ బ్లాక్ కలర్ ఫినిషింగ్‌తో, కారు మొత్తం బ్యాట్‌మ్యాన్ థీమ్‌లో మెరిసిపోతుంది. బంపర్లు, వీల్ ఆర్చ్‌లపై గ్లోసీ బాడీ క్లాడింగ్ దీనికి ఒక పవర్‌ఫుల్ లుక్‌ను ఇచ్చింది. కారు డోర్లపై బ్యాట్‌మ్యాన్ డెకల్స్, టెయిల్‌గేట్‌పై డార్క్ నైట్ బ్యాడ్జ్, బంపర్లపై బ్యాట్‌మ్యాన్ లోగోలు కారును ఒక నిజమైన బ్యాట్‌మొబైల్ లా మార్చేశాయి. 19 అంగుళాల భారీ వీల్స్, కావాలనుకుంటే 20 అంగుళాల వీల్స్‌గా మార్చుకునే ఆప్షన్ కూడా ఉంది. వీల్స్ మధ్యలో ఉండే హబ్ క్యాప్‌పై బ్యాట్‌మ్యాన్ లోగో, దానికి తోడు బ్రేక్స్, స్ప్రింగ్స్‌పై అల్కెమీ గోల్డ్ పెయింట్ ఫినిషింగ్ కారుకు రాజసం తెచ్చిపెట్టాయి.
ఇంటీరియర్.. గోథమ్ సిటీ ఫీల్
కారు లోపలికి వెళ్తే మీరు ఏదో గోథమ్ సిటీలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. డ్యాష్‌బోర్డ్ మీద ఉండే అల్కెమీ ప్లాక్ మీద మీ కారు ఎడిషన్ నంబర్ ఉంటుంది, ఇది మీ కారును చాలా స్పెషల్‌గా చూపిస్తుంది. ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ అంతా చార్‌కోల్ లెదర్‌తో డిజైన్ చేయబడింది. స్టీరింగ్ వీల్, కంట్రోలర్లు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, కీ-ఫోబ్ (కీ) మీద కూడా బ్యాట్‌మ్యాన్ లోగోలు ఉన్నాయి. డ్రైవర్ సీటు చుట్టూ ఉండే అల్కెమీ గోల్డ్ హాలో లైటింగ్ లోపల ఒక లగ్జరీ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది.
రేంజ్, పవర్
మహీంద్రా BE6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ కేవలం లుక్ పరంగానే కాదు, పర్ఫార్మెన్స్‌లో కూడా తోపు అనిపించుకుంటోంది. ఇందులో 79 kWh భారీ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 682 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని ARAI ధృవీకరించింది. దీని మోటార్ 286 హార్స్‌పవర్, 380 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, అంటే కారు రెప్పపాటులో వేగాన్ని అందుకుంటుంది. ఛార్జింగ్ కోసం 7.2 kW, 11 kW ఏసీ ఛార్జర్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.27.79 లక్షలుగా నిర్ణయించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
