Mahindra : ఎస్‌యూవీ ప్రియులకు మహీంద్రా షాక్: బోలెరో నియో ధర పెంపు..ఏ వేరియంట్‌పై ఎంతంటే?

Mahindra : ఎస్‌యూవీ ప్రియులకు మహీంద్రా షాక్: బోలెరో నియో ధర పెంపు..ఏ వేరియంట్‌పై ఎంతంటే?
X

Mahindra : కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను సవరించడం సహజం. ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీలు చెబుతున్నాయి. హ్యుందాయ్ తన వెన్యూ మోడల్ ధరలను పెంచిన కొన్ని రోజులకే, మహీంద్రా కూడా తన బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ బోలెరో నియో ధరలను రూ.20,000 వరకు పెంచింది. ఈ కారు కొందామనే ప్లాన్‌లో ఉన్నవారు ఇప్పుడు వేరియంట్‌ను బట్టి అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

వివరాల్లోకి వెళితే.. బోలెరో నియో 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇందులో బేస్ వేరియంట్ అయిన N4 పై అత్యధికంగా రూ.20,000 పెరిగింది. అంటే సుమారు 2.36 శాతం ధర పెరిగింది. అలాగే N8 వేరియంట్‌పై రూ.16,000 పెంచారు. గతంలో రూ.9.29 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉన్న ఈ వేరియంట్ ధర ఇప్పుడు రూ.9.45 లక్షలకు చేరింది. అయితే, ఊరట కలిగించే విషయం ఏంటంటే.. టాప్ వేరియంట్లు అయిన N10, N11, N10 (O) ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇవి పాత ధరలకే అందుబాటులో ఉన్నాయి.

ఫీచర్ల పరంగా చూస్తే.. బోలెరో నియో ఇప్పటికీ తన పటిష్టతను చాటుకుంటోంది. ఇందులో పవర్ఫుల్ mHawk100 ఇంజిన్ ఉంటుంది. సేఫ్టీ కోసం ఏబీఎస్ (ABS) విత్ ఈబీడీ (EBD), కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్, ఎకో మోడ్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇది 7-సీటర్ ఆప్షన్‌లో లభించే కారు కావడంతో మధ్యతరగతి కుటుంబాలకు ఇది మొదటి ఎంపికగా ఉంటోంది. రివర్స్ పార్కింగ్ అసిస్ట్, ప్రీమియం ఇంటీరియర్ వంటి ఫీచర్లు ఉన్న ఈ కారు, మార్కెట్లో మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ క్రెటా వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది. ధరలు పెరిగినప్పటికీ, దీనికున్న క్రేజ్ దృష్ట్యా అమ్మకాలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

Tags

Next Story