Mahindra Scorpio N : ఎస్‌యూవీల చరిత్రలోనే బిగ్గెస్ట్ అప్‌డేట్.. సరికొత్త హంగులతో వస్తున్న స్కాార్పియో ఎన్.

Mahindra Scorpio N : ఎస్‌యూవీ ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతున్న మహీంద్రా స్కాార్పియో ఎన్ ఇప్పుడు మరింత పవర్‌ఫుల్ అవతారంలో రాబోతోంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అదిరిపోయే ఫీచర్లు, అదిరిపోయే లుక్స్‌తో 2026 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ సిద్ధమవుతోంది. ఇప్పటికే రోడ్లపై టెస్టింగ్ జరుపుకుంటున్న ఈ కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇంటీరియర్, సేఫ్టీ పరంగా మహీంద్రా ఈసారి భారీ మార్పులే చేస్తోంది. భారతీయ కస్టమర్లకు సన్‌రూఫ్ అంటే ఎంత ఇష్టమో మహీంద్రాకు బాగా తెలుసు. అందుకే, ప్రస్తుత మోడల్‌లో ఉన్న చిన్న సన్‌రూఫ్ స్థానంలో ఇప్పుడు పనోరమిక్ సన్‌రూఫ్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇది కేబిన్‌లోకి ఎక్కువ వెలుతురు వచ్చేలా చేయడమే కాకుండా, కారు లోపల చాలా విశాలంగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఇది కేవలం గ్లాస్ రూఫ్ మాత్రమే కాదు, దీన్ని పూర్తిగా తెరుచుకునే సదుపాయం కూడా ఉంటుంది. దీనివల్ల ప్రయాణికులు ఆకాశాన్ని చూస్తూ హాయిగా ప్రయాణించవచ్చు.
స్కార్పియో వంటి భారీ కారును ఇరుకైన సందుల్లో పార్క్ చేయడం డ్రైవర్లకు పెద్ద సవాలు. ఈ సమస్యను పరిష్కరించడానికి మహీంద్రా ఇప్పుడు 360 డిగ్రీ కెమెరా ఫీచర్‌ను జోడిస్తోంది. కారు అద్దాల కింద అమర్చిన కెమెరాల ద్వారా కారు చుట్టూ ఉన్న దృశ్యాలను స్క్రీన్‌పై స్పష్టంగా చూడవచ్చు. దీనికి తోడు ఇప్పటికే ఉన్న లెవల్-2 ADAS టెక్నాలజీ (ఆటోమేటిక్ బ్రేకింగ్, లేన్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్) మరింత మెరుగుపడనుంది. బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి ఫీచర్లు డ్రైవింగ్‌ను మరింత సురక్షితం చేస్తాయి.
2026 స్కార్పియో-ఎన్ ఫేస్‌లిఫ్ట్ ముందు భాగంలో భారీ మార్పులు ఉండబోతున్నాయి. గ్రిల్ పరిమాణం పెంచి, దానిని బంపర్ వరకు విస్తరించనున్నారు. కొత్త LED హెడ్‌ల్యాంప్స్, టర్నింగ్ సమయంలో వెలుగునిచ్చే కార్నరింగ్ ఫాగ్ ల్యాంప్స్ కారుకు ఒక అగ్రెసివ్ లుక్‌ను ఇస్తాయి. వీల్ సైజు 18 అంగుళాలే ఉన్నప్పటికీ, వాటి అల్లాయ్ వీల్స్ డిజైన్ మాత్రం పూర్తిగా కొత్తగా ఉండబోతోంది. మొత్తానికి కారు బయట నుంచి చూస్తే మరింత వెడల్పుగా, దృఢంగా కనిపిస్తుంది.
కారు లోపలికి వస్తే, 10.2-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మీకు స్వాగతం పలుకుతుంది. ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేను సపోర్ట్ చేస్తుంది. డ్రైవర్ కోసం సరికొత్త TFT డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ (థార్ రాక్స్ లాంటిది) ఏర్పాటు చేస్తున్నారు. కేబిన్ లైట్స్ ప్యానెల్ కూడా ఇటీవల లాంచ్ అయిన XUV7XO మోడల్ నుంచి తీసుకోనున్నారు. సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ వాడకం వల్ల ఇంటీరియర్ ఇప్పుడు మరింత ప్రీమియం కార్లలా అనిపిస్తుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
