Mahindra : మహీంద్రా విజన్ ఎస్ సెన్సేషన్.. మెర్సిడెస్ మేబ్యాక్ రేంజ్ వీల్స్‌తో అదిరిపోయే లుక్.

Mahindra : భారతదేశపు ఎస్‌యూవీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి మరో పవర్‌ఫుల్ వాహనం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇండియన్ రోడ్లపై టెస్టింగ్ దశలో ఉన్న ఈ కొత్త కారు పేరు మహీంద్రా విజన్ ఎస్. దీనికి సంబంధించిన అధికారిక ప్రొడక్షన్ ఇంకా మొదలుకాకపోయినప్పటికీ, ఇంటర్నెట్‌లో దీనికి సంబంధించిన డిజిటల్ రెండరింగ్ ఫోటోలు సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ప్రముఖ కార్ డిజైనర్లు తమ ఊహలకు పదును పెట్టి ఈ ఎస్‌యూవీ ఎలా ఉండబోతుందో డిజైన్ చేసిన చిత్రాలు ఇప్పుడు వాహన ప్రేమికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.
తాజాగా ఎస్ఆర్కే డిజైన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ కారుకు ఉన్న అల్లాయ్ వీల్స్ చూస్తుంటే, మనకు లగ్జరీ కార్లైన మెర్సిడెస్ మేబ్యాక్ గుర్తుకు వస్తుంది. ఆ తరహా మోనోబ్లాక్ అల్లాయ్ వీల్స్ ఈ ఎస్‌యూవీకి ఒక ప్రీమియం, అల్ట్రా లగ్జరీ లుక్‌ను ఇస్తున్నాయి. సాధారణంగా మహీంద్రా కార్లు రఫ్ అండ్ టఫ్ లుక్‌లో ఉంటాయి, కానీ ఈ విజన్ ఎస్ మాత్రం లగ్జరీకి కేరాఫ్ అడ్రస్‌లా కనిపిస్తోంది.
ఈ కారు డిజైన్ విషయానికి వస్తే.. ఇది చూడటానికి చాలా స్ట్రెయిట్, బాక్సీ షేప్‌లో ఉండబోతోంది. నిలువుగా ఉండే గ్రిల్స్, సర్క్యులర్ ఎల్ఈడీ హెడ్ లైట్లు, ఆకర్షణీయమైన డీఆర్ఎల్స్‌తో ఈ కారు రోడ్డుపై వెళ్తుంటే ఎవరైనా చూడాల్సిందే. కారు పక్క భాగంలో భారీ బాడీ క్లాడింగ్, ఎత్తుగా ఉండే వీల్ ఆర్చెస్ దీనికి ఒక మస్కులర్ ఎస్యూవీ రూపాన్ని ఇస్తున్నాయి. వెనుక భాగంలో కూడా ఆధునిక ఎల్ఈడీ టెయిల్ లైట్లు ఉండే అవకాశం ఉంది.
మహీంద్రా విజన్ ఎస్‌లో పవర్‌ఫుల్ ఇంజిన్లను వాడబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఇందులో XUV 3XOలో వాడిన 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చవచ్చు. అలాగే డీజిల్ ప్రియుల కోసం 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌ను కూడా మహీంద్రా ఇచ్చే ఛాన్స్ ఉంది. గేర్ బాక్స్ విషయానికి వస్తే, మాన్యువల్, ఆటోమేటిక్ రెండు ఆప్షన్లలోనూ ఈ కారు లభిస్తుంది. ఆఫ్-రోడింగ్ ఇష్టపడే వారికి ఇది ఒక గొప్ప ఆప్షన్ కానుంది.
ఈ కొత్త ఎస్‌యూవీని మహీంద్రా తన లైనప్‌లో XUV 3XO కి పైన ఉంచబోతోంది. ఇది మార్కెట్లోకి వస్తే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, రాబోయే టాటా సియెర్రా వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. బలమైన బాడీ, అదిరిపోయే ఫీచర్లు కోరుకునే కస్టమర్లే లక్ష్యంగా మహీంద్రా దీనిని రూపొందిస్తోంది. సమాచారం ప్రకారం.. ఈ పవర్‌ఫుల్ ఎస్‌యూవీ 2027 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
