Mahindra XEV 9S: 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ XEV 9S.. కన్ఫర్మ్ అయిన 8 ధమాకా ఫీచర్స్ ఇవే.

Mahindra XEV 9S: ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల మార్కెట్‌లో మహీంద్రా నుంచి మరో సంచలనం రాబోతోంది. అదే 7-సీటర్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మహీంద్రా XEV 9S. నవంబర్ 27, 2025న అధికారికంగా గ్లోబల్ లాంచ్ కానున్న ఈ ఎస్‌యూవీకి సంబంధించిన టీజర్‌లు రోజుకో అద్భుతమైన ఫీచర్‌ను బయటపెడుతున్నాయి. తాజాగా విడుదలైన టీజర్‌ల ద్వారా ఈ XEV 9S లో ఏకంగా 8 అదిరిపోయే ఫీచర్లు ఖరారయ్యాయి. టెక్నాలజీ, లగ్జరీకి పెద్ద పీట వేస్తూ వస్తున్న ఈ కొత్త ఎస్‌యూవీ వివరాలు చూద్దాం.
కన్ఫర్మ్ అయిన 8 ముఖ్య ఫీచర్లు
మహీంద్రా నుంచి వస్తున్న ఈ కొత్త 7-సీటర్ XEV 9S లో లగ్జరీని పెంచేందుకు ఈ కింది 8 ఫీచర్లను అందించబోతున్నట్లు అధికారిక టీజర్‌ల ద్వారా ఖరారైంది.అవి..
* ట్రిపుల్ స్క్రీన్ సెటప్: (డ్రైవర్, ఇన్ఫోటైన్‌మెంట్, ప్యాసింజర్ కోసం మూడు డిస్‌ప్లేలు)
* స్టీరింగ్ వీల్: బ్యాక్‌లిట్ లోగోతో కూడిన గ్లోస్ బ్లాక్ స్టీరింగ్.
* సౌండ్ సిస్టమ్: హర్మాన్ కార్డాన్ ప్రీమియం ఆడియో సిస్టమ్.
* పవర్ విండో స్విచ్‌లు: టోగుల్ మాదిరిగా ఉండే ప్రత్యేకమైన స్విచ్‌లు.
* డ్రైవర్ సీటు: మెమరీ ఫంక్షన్‌తో కూడిన పవర్ అడ్జస్టబుల్ సీటు.
* ప్యాసింజర్ సీట్లు: వెనక్కి, ముందుకు జరుపుకునే వీలున్న రెండవ వరుస సీట్లు.
* సన్‌రూఫ్: విశాలమైన పనోరమిక్ సన్‌రూఫ్.
* పార్కింగ్ బ్రేక్: ఆటో హోల్డ్ ఫీచర్‌తో కూడిన ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్.
టెక్నాలజీలో దూకుడు
XEV 9e లో చూసినట్లే, ఈ కొత్త 7-సీటర్ XEV 9S లో కూడా మూడు స్క్రీన్లతో కూడిన ట్రిపుల్ స్క్రీన్ సెటప్ ఉంటుంది. ఇందులో డ్రైవర్‌కు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సెంటర్‌లో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ముందు కూర్చునే ప్యాసింజర్ కోసం ప్రత్యేకంగా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ డిస్‌ప్లే ఉంటాయి. అలాగే, XEV 9e, BE 6 మోడళ్లలో వాడినట్లు టోగుల్ మాదిరి పవర్ విండో స్విచ్‌లు ఇంటీరియర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కన్ఫర్మ్ అయిన ఫీచర్లతో పాటు, ఈ ఎస్‌యూవీలో మరిన్ని అత్యాధునిక ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
మూడు-జోన్‌ల క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్, మసాజింగ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు వంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉండవచ్చు.
ఈ ఎస్‌యూవీకి సంబంధించిన అధికారిక స్పెసిఫికేషన్లు ఇంకా బయటకు రానప్పటికీ, 7-సీటర్ XEV 9S ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో XEV 9e లో వాడిన శక్తివంతమైన 59kWh, 79kWh బ్యాటరీ ప్యాక్‌లనే వాడే అవకాశం ఉంది. సింగిల్ మోటార్ కాన్ఫిగరేషన్‌లో, ఈ బ్యాటరీలు MIDC ప్రకారం దాదాపు 542 కి.మీ (59kWh), 656 కి.మీ (79kWh) రేంజ్ ఇవ్వగలవు. 5-సీటర్ వెర్షన్‌తో సమానమైన రేంజ్‌ను XEV 9S కూడా ఇస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

