Mahindra XEV 9S : భారత తొలి 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇదే..ధర, అదిరిపోయే ఫీచర్లు ఇవే.

Mahindra XEV 9S : భారత తొలి 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇదే..ధర, అదిరిపోయే ఫీచర్లు ఇవే.
X

Mahindra XEV 9S : మహీంద్రా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గతేడాది నవంబర్‌లో లాంచ్ చేసిన ఎక్స్‌యూవీ 7XO కి ఎలక్ట్రిక్ వెర్షన్‌గా ఈ XEV 9S మోడల్‌ను తీసుకొచ్చింది. ఈ కారు ధర రూ.19.95 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇది భారతదేశపు మొట్టమొదటి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ 7-సీటర్ ఎస్‌యూవీ. ఈ కారును మహీంద్రాకు చెందిన ప్రతిష్టాత్మక INGLO ఆర్కిటెక్చర్‌పై నిర్మించారు. నేటి నుంచి బుకింగ్స్ ప్రారంభం కాగా, కేవలం పది రోజుల్లోనే అంటే జనవరి 23, 2026 నుంచి డెలివరీలు కూడా మొదలవుతాయని కంపెనీ ప్రకటించింది.

వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా ఈ కారును మూడు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో మహీంద్రా అందుబాటులోకి తెచ్చింది.

59 kWh బ్యాటరీ: ఇది 170 kW పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

70 kWh బ్యాటరీ: ఇది 180 kW పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

79 kWh బ్యాటరీ: ఇది గరిష్టంగా 210 kW పవర్‌ను అందిస్తుంది. అంటే లాంగ్ డ్రైవ్‌లు వెళ్లే వారికి ఇది ఒక పవర్‌ఫుల్ ఆప్షన్.

XEV 9S డిజైన్ చాలా మోడ్రన్‌గా ఉంది. ఎల్-ఆకారంలో ఉండే ఎల్ఈడీ డీఆర్ఎల్స్, వెర్టికల్ ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్ కారుకు మంచి లుక్ ఇస్తున్నాయి. కారు లోపల స్పేస్ విషయంలో మహీంద్రా కొత్త రికార్డు సృష్టించింది. ఇందులో ఏకంగా 4076 లీటర్ల క్యాబిన్ స్పేస్ ఉంది. ఫ్యామిలీతో వెళ్లేటప్పుడు లగేజ్ కోసం 527 లీటర్ల బూట్ స్పేస్‌తో పాటు, ఇంజిన్ ఉండే చోట అదనంగా 150 లీటర్ల ఫ్రంక్ కూడా ఇచ్చారు. థర్డ్ రో లో సీట్లను 50:50 రేషియోలో మడవొచ్చు, దీనివల్ల పెద్ద పెద్ద వస్తువులను కూడా ఈజీగా తీసుకెళ్లొచ్చు.

కారు లోపలి ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇందులో మూడు భారీ 31.24 సెం.మీ స్క్రీన్లు ఉన్నాయి. డాల్బీ అట్మోస్‌తో కూడిన 16-స్పీకర్ల హర్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్ ప్రయాణాన్ని ఒక థియేటర్ అనుభూతిగా మారుస్తుంది. సెకండ్ రో ప్రయాణికుల కోసం వెంట్లేటెడ్ సీట్లు, సన్‌షేడ్స్, బాస్ మోడ్ ఫీచర్ ఇచ్చారు. వైర్‌లెస్ ఛార్జింగ్, 5G కనెక్టివిటీ, మూడు రకాల యాంబియంట్ మూడ్ లైటింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

సేఫ్టీ విషయంలో మహీంద్రా తగ్గేదే లే అంటోంది. ఈ ఎస్‌యూవీలో ఏకంగా ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. అలాగే లెవల్ 2+ అడాస్ (ADAS) ఫీచర్ ఉంది, ఇది ఐదు రాడార్ల ద్వారా కారును ప్రమాదాల నుంచి రక్షిస్తుంది. డ్రైవర్ నిద్రపోతున్నా లేదా అలసటగా ఉన్నా గుర్తుపట్టే 'DOMS' టెక్నాలజీ ఇందులో ఉంది. అలాగే కారు చుట్టూ ఏం జరుగుతుందో లైవ్‌గా చూసే Secure360 Pro వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Tags

Next Story