Mahindra : టాటా హారియర్, క్రెటాలకు షాక్.. 7 సీట్ల మహీంద్రా XEV 9S ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వచ్చేది ఎప్పుడంటే ?

Mahindra : టాటా హారియర్, క్రెటాలకు షాక్.. 7 సీట్ల మహీంద్రా XEV 9S ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వచ్చేది ఎప్పుడంటే ?
X

Mahindra : భారతదేశంలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల మార్కెట్ వేగంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మహీంద్రా అండ్ మహీంద్రా తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ XEV 9S టీజర్‌ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ కంపెనీ లైనప్‌లో కీలకమైన లాంచ్ కానుంది. ముఖ్యంగా ఇది ప్రస్తుత XEV 9e మోడల్ కంటే పొడవైన వీల్‌బేస్‌తో ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌తో రావడం విశేషం. నవంబర్ 27న లాంచ్ కానున్న ఈ XEV 9S, టాటా హారియర్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఈవీ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. మరి మహీంద్రా ఈ బోర్న్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఎలాంటి ఫీచర్లు, రేంజ్ ఉండవచ్చో చూద్దాం.

మహీంద్రా సంస్థ తమ భవిష్యత్తు ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిలో భాగంగా కొత్త ఎస్‌యూవీ XEV 9S టీజర్‌ను విడుదల చేసింది. ఇది కంపెనీ Born Electric సిరీస్‌లో ఒక కీలకమైన మోడల్. మహీంద్రా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని నవంబర్ 27న అధికారికంగా లాంచ్ చేయనుంది. మార్కెట్లో ఇది నేరుగా టాటా హారియర్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఈవీ, ఎంజీ జడ్ఎస్ ఈవీ వంటి ప్రముఖ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలతో పోటీ పడుతుంది.

XEV 9S ను మహీంద్రా ప్రత్యేకమైన INGLO (Indian Global) ప్లాట్‌ఫామ్‌పై నిర్మించనున్నారు. ఈ ప్లాట్‌ఫామ్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. INGLO ఆర్కిటెక్చర్ ఫ్లెక్సిబుల్‌గా ఉండటం వల్ల వాహనం పొడవు, సీటింగ్ కాన్ఫిగరేషన్‌ను మార్చడానికి వీలు కలుగుతుంది. XEV 9S అతి పెద్ద ప్రత్యేకత ఏమిటంటే.. ఇది ఏడు సీట్ల (త్రీ-రో) కాన్ఫిగరేషన్‌తో రావడం. ఇది ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ఐదు సీట్ల XEV 9e కంటే పొడవైన వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఈ అదనపు పొడవు మూడవ వరుస ప్రయాణికులకు కూడా సరిపడా స్థలాన్ని అందిస్తుంది.

XEV 9S స్పెసిఫికేషన్లు ఇప్పటికే అందుబాటులో ఉన్న XEV 9e మోడల్‌ను పోలి ఉండే అవకాశం ఉంది. ఈ ఎస్‌యూవీలో పెద్దదైన 79 kWh బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. ఈ 79 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఒకే ఒక్క పూర్తి ఛార్జ్‌పై ఏకంగా 656 కిలోమీటర్ల దూరం వరకు రేంజ్‌ను అందించే అవకాశం ఉంది. XEV 9e లో ఉన్న 59 kWh బ్యాటరీ ప్యాక్ (542 కి.మీ రేంజ్) కూడా XEV 9S లో తక్కువ ధరలో ఆప్షన్‌గా అందించవచ్చు. మహీంద్రా ఈ కొత్త XEV 9S లో తమ బ్రాండ్ ఇతర ఎలక్ట్రిక్ వాహనాలలో ఉన్న అడ్వాన్సుడ్ ఫీచర్లను కూడా చేర్చే అవకాశం ఉంది. XEV 9S కారు తమ కొత్త ఎలక్ట్రిక్ యుగాన్ని ప్రతిబింబిస్తుందని, ఇది కంపెనీ Born Electric సిరీసులో ముఖ్యమైన భాగమని మహీంద్రా పేర్కొంది. ఈ లాంచ్‌పై సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది.

Tags

Next Story