Mahindra XEV 9S : మహింద్రా XEV 9S లాంచ్..7 సీట్ల ఎలక్ట్రిక్ కారు ధర రూ.19.95 లక్షలే.

Mahindra XEV 9S : మహీంద్రా సంస్థ తమ కొత్త ఆల్-ఎలక్ట్రిక్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అయిన XEV 9S ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.19.95 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. XEV 9e తర్వాత INGLO ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫామ్‌పై వచ్చిన ఈ మోడల్‌ను విశాలమైన కేబిన్ స్పేస్, ఆన్‌బోర్డ్ టెక్నాలజీ, అద్భుతమైన సీటింగ్ కంఫర్ట్‌కు ప్రాధాన్యత ఇస్తూ డిజైన్ చేశారు. ఈ కారు పేరులో ఉన్న S అనేది స్పేస్ను సూచిస్తుంది. ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. టాప్-స్పెక్ ప్యాక్ త్రీ అబౌవ్ వేరియంట్ ధర రూ.29.45 లక్షలు వరకు ఉంది. ఈ కారుకు జనవరి 14, 2026 నుంచి బుకింగ్‌లు మొదలవుతాయి. జనవరి 23, 2026 నుంచి కస్టమర్ డెలివరీలు ప్రారంభమవుతాయి.
XEV 9S డిజైన్ చూడటానికి BE 6, XEV 9e మోడల్‌ల డిజైన్‌ను పోలి ఉంటుంది. ఇందులో కనెక్టెడ్ LED డీఆర్‌ఎల్‌లు, స్ప్లిట్ LED టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ మొత్తం క్యాబిన్ వాల్యూమ్ 3,941 లీటర్లు కాగా, బూట్ స్పేస్ 527 లీటర్లు, ముందు భాగంలో (ఫ్రంక్) 150 లీటర్ల అదనపు స్టోరేజ్ ఉంది. ఇందులో 59 kWh, 70 kWh, 79 kWh అనే మూడు LFP బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అత్యధికంగా 79 kWh బ్యాటరీ ప్యాక్ గల వేరియంట్ 679 కి.మీల MIDC రేంజ్ను ఇస్తుంది. ఈ కారు 210 kW మోటార్‌తో 380 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 7 సెకన్లలో 0-100 kph వేగాన్ని అందుకోగలదు, దీని గరిష్ట వేగం గంటకు 202కిమీగా ఉంది. ఇది తన విభాగంలో అత్యంత వేగవంతమైన 7-సీటర్ ఎస్‌యూవీ అని మహింద్రా పేర్కొంది. అన్ని వేరియంట్లలో 20 నిమిషాల్లో 20-80% వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.
XEV 9S కారు ఇంటీరియర్, ఫీచర్లు చాలా ప్రీమియంగా ఉన్నాయి. క్యాబిన్‌లో టెక్నాలజీ, ప్యాసింజర్ అనుభవంపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఇందులో మొట్టమొదటిసారిగా మహింద్రా కొత్త MAIA AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సిస్టమ్ ను పరిచయం చేశారు. డ్యాష్‌బోర్డ్‌లో పెద్ద ట్రిపుల్-స్క్రీన్ సెటప్ ఉంది. దీంతో పాటు పనోరమిక్ సన్‌రూఫ్ (బేస్ వేరియంట్ నుంచి), వెంటిలేటెడ్ సీట్లు, 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, డ్రైవర్ కోసం విజన్ ఎక్స్ ఆగ్మెంటెడ్-రియాలిటీ హెడ్-అప్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం ఈ కారులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా ఇచ్చారు. అలాగే లెవెల్-2+ ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఉంది. ఈ ADAS సూట్‌లో 5 రాడార్లు, 1 విజన్ కెమెరా ఉన్నాయి. డ్రైవర్ నిద్రపోతున్నా కూడా గుర్తించే సిస్టమ్ కూడా ఇందులో ఉండటం విశేషం.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

