Mahindra XUV 3XO EV : కస్టమర్లకు గుడ్ న్యూస్..మహీంద్రా XUV 3XO EV డెలివరీకి ముహూర్తం ఖరారు

Mahindra XUV 3XO EV : మహీంద్రా నుంచి వచ్చిన అత్యంత చవకైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మహీంద్రా XUV 3XO ఈవీ కోసం ఎదురుచూస్తున్న ఇన్వెస్టర్లు, కస్టమర్లకు గుడ్ న్యూస్. ఈ కారు డెలివరీ తేదీపై కంపెనీ స్పష్టత ఇచ్చింది. గత నెలలో లాంచ్ అయిన ఈ ఎలక్ట్రిక్ కారు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం కాగా, కస్టమర్లకు వాహనాలను ఎప్పుడు అప్పగిస్తారనే దానిపై తాజా అప్‌డేట్ వచ్చేసింది.
తాజా నివేదికల ప్రకారం.. మహీంద్రా XUV 3XO EV డెలివరీ వచ్చే వారం, అంటే ఫిబ్రవరి 23, 2026 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. మీరు ఇప్పటికే ఈ కారును బుక్ చేసుకుని ఉంటే, వచ్చే వారం నుంచి మీ డీలర్ మిమ్మల్ని సంప్రదించే అవకాశం ఉంది. మహీంద్రా ఈ కారును రెండు ప్రధాన ట్రిమ్స్‌లో లాంచ్ చేసింది.
AX5 (బేస్ వేరియంట్): రూ.13.89 లక్షలు
AX7L (టాప్ వేరియంట్): రూ.14.96 లక్షలు
ఇందులో 39.4 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై దాదాపు 285 కిలోమీటర్ల (రియల్ వరల్డ్ రేంజ్) ప్రయాణాన్ని ఆఫర్ చేస్తుంది. ఈ కారు కేవలం 8.3 సెకన్లలోనే 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఇందులో Fun, Fast, Fearless అనే మూడు మోడ్స్ ఇచ్చారు.
ఈ ఎస్‌యూవీలో కేవలం ధర మాత్రమే కాదు, ఫీచర్లు కూడా అదిరిపోయాయి. ఇందులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, సుమారు 80కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ (TPMS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటి ఫీచర్లు ఉన్నాయి. టాప్ వేరియంట్ (AX7L) లో Level 2 ADAS ఫీచర్లు ఉన్నాయి. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, కొలిజన్ వార్నింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్ వంటి అత్యాధునిక రక్షణ వసతులు ఉన్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
