Mahindra : మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల ప్రభంజనం..10 నెలల్లోనే 41 వేల కార్ల విక్రయం.

Mahindra : మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల ప్రభంజనం..10 నెలల్లోనే 41 వేల కార్ల విక్రయం.
X

Mahindra : మహీంద్రా అండ్ మహీంద్రా ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో తిరుగులేని వేగంతో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (eSUV) విభాగంలో కంపెనీ సృష్టించిన రికార్డులు చూస్తుంటే, భవిష్యత్తులో ఈ సెగ్మెంట్లో మహీంద్రాదే పైచేయి అనిపిస్తోంది. కేవలం 10 నెలల్లోనే 41,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను విక్రయించి కంపెనీ సరికొత్త మైలురాయిని అందుకుంది. అటు సంప్రదాయ ఇంధన కార్లు, ఇటు ఎలక్ట్రిక్ వాహనాల మధ్య బ్యాలెన్సింగ్ కాపాడుతూ మహీంద్రా ముందుకు సాగుతోంది.

మహీంద్రా తన బార్న్ ఎలక్ట్రిక్ వాహనాలతో మార్కెట్‌ను శాసిస్తోంది. మార్చి 2025లో డెలివరీలు ప్రారంభించినప్పటి నుంచి జనవరి 31, 2026 నాటికి 41,000 కంటే ఎక్కువ ఈవీలను విక్రయించింది. ఇందులో ప్రధానంగా నవంబర్ 2024లో విడుదలైన BE 6, XEV 9e, XEV 9S మోడల్స్ ఉన్నాయి. ఇప్పటివరకు మహీంద్రా ఈవీ కస్టమర్లు మొత్తం 32 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించడం విశేషం. ఇది కస్టమర్లలో మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. భవిష్యత్తులో ఈ ఉత్పత్తిని మరింత పెంచేందుకు కంపెనీ రూ.13,800 కోట్లను మహారాష్ట్రలో పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించింది.

సంప్రదాయ ఇంధన వాహనాలను ఇష్టపడే వారి కోసం మహీంద్రా 2026 క్యాలెండర్ ఇయర్లో రెండు భారీ లాంచ్‌లను ప్లాన్ చేసింది. పాపులర్ అయిన Scorpio N, Scorpio Classic రెండింటికీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను తీసుకురానుంది. స్కోర్పియో ఎన్‌ ఫేస్‌లిఫ్ట్‌లో పనోరమిక్ సన్‌రూఫ్, ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. 3-డోర్ థార్ ప్రేమికుల కోసం కొత్త డిజైన్, మరిన్ని ఫీచర్లతో కూడిన మేజర్ ఫేస్‌లిఫ్ట్‌ను మహీంద్రా సిద్ధం చేస్తోంది. ఇవి కాకుండా తాజాగా మార్కెట్లోకి వచ్చిన XUV 7XO కూడా అమ్మకాల్లో దూసుకుపోతోంది.

ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల కోసం మహీంద్రా ఒక వినూత్నమైన సేవను ప్రారంభించింది. eVAN(Electric Vehicle Assistance Network) పేరుతో ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో రిమోట్ సర్వీస్ వ్యాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యాన్లు నేరుగా కస్టమర్ ఇంటి వద్దకే వచ్చి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, డయాగ్నోస్టిక్ తనిఖీలు, చిన్నపాటి ఎలక్ట్రికల్ సమస్యలు, మెకానికల్ రిపేర్లను చేస్తాయి. దీనివల్ల కస్టమర్లకు వర్క్‌షాప్‌కు వెళ్లే అవసరం లేకుండా సమయం ఆదా అవుతుంది. త్వరలోనే ఈ సేవలను మిగిలిన ప్రధాన నగరాలకు కూడా విస్తరించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

Tags

Next Story