BSNL : బీఎస్ఎన్ఎల్‌కు భారీ ఊరట.. కేంద్రం కొత్త ప్యాకేజీ వివరాలు ఇవే

ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ కు నష్టాలు తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కు తెలిపింది. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో నష్టాలు 5,371 కోట్లకు తగ్గినట్లు తెలిపింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో బీఎస్ఎన్ఎల్ కు రూ.8,161 కోట్ల నష్టాలు వచ్చాయి. ఈ విషయాన్ని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పార్లమెంట్ లో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
కేంద్రం తీసుకుంటున్న చర్యలు, ఇస్తున్న ప్యాకేజీల కారణంగా బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ 2020-21 నుంచి ఆపరేటింగ్ ప్రాఫిట్స్ సాధిస్తున్నాయని మంత్రి తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో 4జీ సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి లక్ష 4జీ సైట్లను ఆర్డర్ చేసిందని తెలిపారు. వీటిని సులభంగా 5జీకి అప్ గ్రేడ్ చేయవచ్చని తెలిపారు. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ను పునరుద్ధరించడానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
2019లో రూ.69 వేల కోట్లతో పునరుద్ధరణ ప్యాకేజీ ఇచ్చిందని, 2022లో రూ.1.64 లక్షల ప్యాకేజీ ఇచ్చినట్లు తెలిపారు. 2023లో రూ.89 వేల కోట్ల విలువైన 4జీ, 5జీ స్పెక్టాన్ని బీఎస్ఎన్ఎల్ కు కేటాయించినట్లు తెలిపారు. బడ్జెట్లో ప్రభుత్వటెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ కు రూ. 82,916 కోట్లు కేటాయించారు. మొత్తం టెలికం సంస్థలు, ప్రాజెక్ట్లల కోసం బడ్జెట్ లో రూ.1.28 లక్షల కోట్లు కేటాయించారు. బీఎస్ ఎన్ఎల్ పునర్ నిర్మాణం, టెక్నాలజీ అప్ డేషన్ కోసం ఈ నిధులు కేటాయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com