March Car Launches: కొత్త కారు కొనాలనుకుంటున్నారా ? మార్చిలో లాంచ్ కాబోతున్న టాప్ మోడల్స్ ఇవే.

March Car Launches: కొత్త కారు కొనాలనుకుంటున్నారా ? మార్చిలో లాంచ్ కాబోతున్న టాప్ మోడల్స్ ఇవే.
X

March Car Launches: భారత ఆటోమొబైల్ రంగంలో మార్చి 2026 నెల కొత్త కార్ల జాతరను తలపించబోతోంది. సరికొత్త డిజైన్లు, పవర్ఫుల్ ఇంజిన్లు, అత్యాధునిక ఎలక్ట్రిక్ టెక్నాలజీతో పలు దిగ్గజ కంపెనీలు తమ కార్లను రోడ్లపైకి వదిలేందుకు సిద్ధమయ్యాయి. మీరు కూడా కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ నెలలో లాంచ్ కాబోతున్న ఈ హాట్ మోడల్స్‌పై ఒక కన్నేయాల్సిందే. మధ్యతరగతికి అందుబాటులో ఉండే ఎస్‌యూవీల నుంచి కోట్లు పలికే లగ్జరీ కార్ల వరకు ఈ జాబితాలో అన్నీ ఉన్నాయి.

చాలా కాలంగా ఎదురుచూస్తున్న రెనాల్ట్ డస్టర్ మార్చి 17న అధికారికంగా రీ లాంచ్ కానుంది. ఇప్పటికే షోరూమ్‌లకు చేరుకున్న ఈ కారు ఏప్రిల్ నుంచి కస్టమర్లకు డెలివరీ కానుంది. ఇందులో రెండు టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి: ఒకటి 100 హార్స్‌పవర్ ఇచ్చే 1-లీటర్ ఇంజిన్, రెండోది 163 హార్స్‌పవర్ ఇచ్చే పవర్ఫుల్ 1.3-లీటర్ ఇంజిన్. ఇక మైలేజీ ప్రియుల కోసం దీపావళి సమయానికి 1.8-లీటర్ హైబ్రిడ్ మోడల్‌ను కూడా రెనాల్ట్ తీసుకురానుంది. ఇది హ్యుందాయ్ క్రెటా, టాటా సియెర్రా వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.

లగ్జరీ కార్ల విభాగంలో ఆడి ఎస్‌క్యూ8 తన ప్రతాపాన్ని చూపించబోతోంది. మార్చి 17నే లాంచ్ కానున్న ఈ కారులో 4.0 లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్ అమర్చారు. ఇది కేవలం 4.1 సెకన్లలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. రేసింగ్ లవర్లను అలరించేలా 507 హార్స్‌పవర్, 770 ఎన్ఎమ్ టార్క్‌ను ఇది ఉత్పత్తి చేస్తుంది. మెర్సిడెస్ AMG GLE 53 కూపే వంటి కార్లకు ఇది ప్రధాన ప్రత్యర్థిగా నిలవనుంది.

ఇక టయోటా నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు అర్బన్ క్రూయిజర్ ఎబెలా మార్చిలో ధరల ప్రకటనతో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 440 కిలోమీటర్ల నుంచి 543 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. 49kWh, 61kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తున్న ఈ కారు ఈవీ మార్కెట్లో సరికొత్త సంచలనం సృష్టించబోతోంది.

చివరగా జర్మన్ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ తన సీఎల్ఏ ఎలక్ట్రిక్ కోసం మార్చి 10 నుంచి బుకింగ్స్ ప్రారంభించనుంది. ఇందులో 85.5kWh బ్యాటరీని వాడారు, ఇది అద్భుతమైన 792 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ప్రీమియం ఎలక్ట్రిక్ సెడాన్ కోరుకునే వారికి ఇది ఒక గొప్ప ఎంపిక కానుంది. మొత్తానికి మార్చి నెల కార్ల ప్రేమికులకు పండగే అని చెప్పాలి.

Tags

Next Story