Mark Zuckerberg : మార్క్ జుకర్‌బర్గ్ సంపద 16.8లక్షల కోట్లు
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రపంచంలోని నాలుగో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. 200 బిలియన్ డాలర్లు(రూ.16 లక్షల కోట్లు) మించి నికర విలువను సంపాదించిన అతికొద్ది మంది వ్యక్తుల్లో ఒకరిగా స్థానం సంపాదించారు. ఈమేరకు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో వివరాలు వెల్లడయ్యాయి. జుకర్‌బర్గ్ సంపద ప్రస్తుతం 201 బిలియన్ డాలర్ల(రూ.16.8 లక్షల కోట్లు)కు చేరుకుంది. ఇప్పటివరకు టెస్లా సీఈఓ ఇలోన్ మస్క్ 272 బిలియన్ డాలర్ల(రూ.22.7 లక్షల కోట్లు) సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. తర్వాత స్థానాల్లో వరుసగా అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ (211 బిలియన్ డాలర్లు-రూ.17.6 లక్షల కోట్లు), ఎల్‌వీఎంహెచ్ ఛైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ (207 బిలియన్ డాలర్లు-రూ.17.3 లక్షల కోట్లు) ఉన్నారు. జుకర్‌బర్గ్ ఇప్పటివరకు నాలుగోస్థానంలో ఉన్న ఓరాకిల్ కార్పొరేషన్ సహవ్యవస్థాపకులు లారీ ఎల్లిసన్‌ను వెనక్కినెట్టారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com