Maruti Dzire : మారుతీ డిజైర్ సరికొత్త రికార్డు.. 30 లక్షల మంది మనసు గెలిచిన సూపర్ హిట్ కారు.

Maruti Dzire : భారతీయ ఆటోమొబైల్ రంగంలో మారుతీ సుజుకి డిజైర్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ సెడాన్ కార్లలో ఒకటిగా పేరుగాంచిన ఈ కారు, తాజాగా 30 లక్షల యూనిట్ల సేల్స్ మార్కును దాటేసింది. 2008లో తొలిసారిగా మార్కెట్లోకి వచ్చిన ఈ కారు, గత 16 ఏళ్లలో నాలుగు తరాలుగా రూపాంతరం చెందుతూ భారతీయ కస్టమర్ల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. 2025లో కూడా దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచి, ఏకంగా 2.14 లక్షల యూనిట్ల విక్రయాలతో తన సత్తా చాటింది.
ఈ కారుకు ఇంతటి ఆదరణ దక్కడానికి ప్రధాన కారణం దాని ధర, అది ఇచ్చే మైలేజ్. డిజైర్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర సుమారు రూ.6.26 లక్షల (LXi వేరియంట్) నుంచి ఉండగా, టాప్ ఎండ్ వేరియంట్ (ZXi Plus) రూ.9.31 లక్షల వరకు ఉంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే, ఇందులో అమర్చిన 1.2 లీటర్ జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజన్ మాన్యువల్ మోడ్‌లో 24.79 కిమీ, ఆటోమేటిక్ (AGS) మోడ్‌లో 25.71 కిమీ మైలేజ్ ఇస్తుంది. ముఖ్యంగా సిఎన్జీ (CNG) వేరియంట్ కిలో గ్యాస్‌కు ఏకంగా 33.73 కిమీ మైలేజ్ ఇస్తూ వినియోగదారులకు భారీ ఊరటనిస్తోంది.
ఫీచర్ల విషయంలో కూడా మారుతీ ఎక్కడా తగ్గలేదు. సరికొత్త డిజైర్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ వ్యూ కెమెరా, 9-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు అలెక్సా స్కిల్స్, స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ వంటి ఆధునిక సాంకేతికతను కూడా జోడించారు. భద్రతకు పెద్దపీట వేస్తూ ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌పీ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్, ఏబీఎస్ (ABS) వంటి ఫీచర్లను స్టాండర్డ్ గా అందిస్తున్నారు.
మరీ ముఖ్యంగా, ఒకప్పుడు సేఫ్టీ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న మారుతీ, కొత్త డిజైర్‌తో ఆ ముద్రను చెరిపేసింది. ఈ కారు గ్లోబల్ ఎన్‌సిఏపి, భారత్ ఎన్‌సిఏపి నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. ఇది కుటుంబ ప్రయాణాలకు అత్యంత సురక్షితమైన కారు అని నిరూపితమైంది. పెట్రోల్, ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్జీ ఆప్షన్లతో లభిస్తున్న ఈ కారు, ఇటీవల జీఎస్టీ మార్పుల వల్ల మరింత అందుబాటులోకి వచ్చింది. అందుకే సామాన్యుల నుంచి ఆఫీసు గోయర్స్ వరకు ప్రతి ఒక్కరికీ డిజైర్ మొదటి ఛాయిస్ గా మారుతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
