Maruti Ignis Price : జీఎస్టీ తగ్గింపుతో మారుతి ఇగ్నిస్‌పై భారీ డిస్కౌంట్.. త్వరపడండి

Maruti Ignis Price : జీఎస్టీ తగ్గింపుతో మారుతి ఇగ్నిస్‌పై భారీ డిస్కౌంట్.. త్వరపడండి
X

Maruti Ignis Price : మారుతి సుజుకి క్రాస్‌ఓవర్ స్టైల్ హ్యాచ్‌బ్యాక్ కారు అయిన మారుతి ఇగ్నిస్ మార్కెట్లో పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయినా, ఈ కారును ఇష్టపడే వారికి మాత్రం ఇది ఎంతో నచ్చుతుంది. పట్టణ ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయబడిన ఈ కారు 2017లో మారుతి నెక్సా సిరీస్‌లో భాగంగా విడుదలైంది. తాజాగా, దీపావళి పండుగ ముందు జీఎస్టీ 2.0 కింద కొత్త పన్ను విధానం అమలు కావడంతో, మారుతి ఇగ్నిస్ ధరలు భారీగా తగ్గాయి. ఈ కొత్త తగ్గింపుతో కారు ధర ఏకంగా రూ.71,000 వరకు తగ్గింది.

జీఎస్టీ తగ్గింపు తర్వాత, మారుతి ఇగ్నిస్ ధరలు వేరియంట్‌ను బట్టి మారాయి. వినియోగదారులకు గరిష్టంగా రూ.71,000 వరకు ప్రయోజనం లభించింది. ఇగ్నిస్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు రూ.5.35 లక్షలుగా ఉంది. ఇది ఇంతకుముందు రూ.5.85 లక్షలుగా ఉండేది. అత్యంత తక్కువ తగ్గింపు రూ.47,000 లభించిన వేరియంట్ జీటా ఎమ్‌టి. దీని కొత్త ఎక్స్-షోరూమ్ ధర రూ.6.50 లక్షలు (పాత ధర రూ.6.97 లక్షలు).

అత్యధిక తగ్గింపు రూ.71,000 లభించిన వేరియంట్ ఆల్ఫా ఏఎమ్‌టి డ్యూయల్-టోన్. దీని ధర ఇప్పుడు రూ.7.55 లక్షలు (పాత ధర రూ.8.26 లక్షలు). ఏఎమ్‌టి వేరియంట్‌లు ఇప్పుడు రూ.6.30 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఇది పాత ధర రూ.6.89 లక్షల కంటే తక్కువ. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ ఈ ధరల తగ్గింపుతో పాటు ప్రత్యేక డిస్కౌంట్లు, ఆఫర్‌లను ప్రకటించింది. కంపెనీతో పాటు డీలర్లు కూడా వినియోగదారులకు అదనపు ప్రయోజనాలను అందిస్తున్నారు. ఈ ఆఫర్లు, ధరల తగ్గింపుల కారణంగా రాబోయే వారాల్లో మారుతి ఇగ్నిస్ అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

మారుతి సుజుకి ఇగ్నిస్‌లో స్ట్రాంగ్ ఇంజిన్ అందించింది. ఇగ్నిస్‌లో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది మారుతి ఇతర సక్సెస్ ఫుల్ కార్లలో కూడా ఉపయోగించబడుతోంది. ఈ ఇంజిన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 81 bhp పవర్, 4,200 ఆర్‌పిఎమ్ వద్ద 113 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారును 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో కొనుగోలు చేయవచ్చు.

Tags

Next Story